EPAPER

IAS officers: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల పిటిషన్.. మళ్లీ వాయిదా.. తీరని ఉత్కంఠ!

IAS officers: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల పిటిషన్.. మళ్లీ వాయిదా.. తీరని ఉత్కంఠ!

IAS officers move CAT over cadre allocation in Telangana: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలిలను ఏపీ క్యాడర్‌కు కేటాయించారు. అయితే తాము తెలంగాణలోనే విధులు నిర్వహించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ క్యాడర్‌కు చెందిన సృజన మాత్రం తనను ఏపీలో కొనసాగించేలా ఉత్వర్వులు ఇవ్వాలని పిటిషన్ చేశారు. ప్రస్తుతం ఈ నలుగురికి సంబంధించిన పిటిషన్లపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ మంగళవారం విచారణ ప్రారంభించింది.


తెలంగాణ ఎనర్జీ శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోజ్, తెలంగాణ టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్, తెలంగాణ మహిళా శిశు శాఖ సెక్రటరీ వాకాటి కరుణ, తెలంగాణ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఏపీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనలు డీఓపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోరారు. తెలంగాణలో కొనసాగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోరారు.

రాష్ట్ర విభజన సమయంలో అధికారుల బదిలీలపై క్యాట్ స్టే విధించింది. క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో డీఓపీటీ పిటిషన్ వేసింది. ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయి. ఇందులో భాగంగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇటీవల అధికారుల బదిలీలపై డీఓపీటీ సర్క్యులర్ జారీ చేసింది. కాగా, ఈ నెల 16న అధికారులు రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను క్యాట్ మధ్యాహ్నం 2.30కి వాయిదా వేసింది.


Also Read: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

ఇదిలా ఉండగా, ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ నెల 9న కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు అమ్రపాలి, కరుణ, వాణిప్రసాద్ క్యాట్‌ను ఆశ్రయించారు. డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖ‌లు చేశారు. ఏపీకి వెళ్లేందుకు తాము సిద్ధంగా లేమని, తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుండగా.. ఈనెల 16 లోగా రిపోర్టు చేయాలని డీఓపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Related News

Minister Ponnam: అలా చేస్తే క్రిమినల్ కేసులు పెడుతాం.. జాగ్రత్త: మంత్రి పొన్నం

Minister Seethakka: దామగుండం ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవో ఇచ్చింది: మంత్రి సీతక్క

CM Revanth Reddy: దేశ రక్షణకు అన్ని విధాలా సహకరిస్తా.. ఆ నేతల మాదిరిగా రాజకీయాలు చేయను.. సీఎం రేవంత్

Kiran Kumar on KTR: పదేళ్లలో భారీ బిల్డింగ్స్ కట్టుకున్నారు.. అప్పుడు కనిపించలేదా.. కేటీఆర్ కు ఎంపీ సూటి ప్రశ్న

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

jagital: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!

Big Stories

×