EPAPER

HYDRA: ఇక.. జిల్లాల్లోనూ హైడ్రా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

HYDRA: ఇక.. జిల్లాల్లోనూ హైడ్రా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

అందరి లెక్కలూ తేలుస్తా


– కలెక్టర్లు తక్షణం రంగంలోకి దిగాలి
– రాష్ట్రంలో ఒక్క అక్రమ నిర్మాణమూ ఉండొద్దు
– త్వరలోనే వరంగల్‌లోనూ యాక్షన్ షురూ
– వరద సమయంలో రాజకీయ విమర్శలా?
– హరీశ్.. పువ్వాడ అజయ్ ఆక్రమణలపై మాట్లాడు
– ప్రతిపక్ష నేత మాదిరి ఫామ్‌హౌజ్‌లో పండలే
– అమెరికా నుంచి కేటీఆర్ మతిలేని మాటలు
– మీడియా మీట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని, ఏదో ఒకరోజు ఆ ప్రకృతి విలయానికి బాధితుడిగా మారక తప్పదని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లాలన్నింటిలోనూ ఆక్రమణలను గుర్తించి, తక్షణం వాటిపై హైడ్రా తరహాలో చర్యలకు దిగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అనంతరం ముఖ్యమంత్రి కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. మహబూబాద్, వరంగల్ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల లెక్కలు తీసి, అక్రమ నిర్మాణాలను కూలగొట్టాలని, ఈ విషయంలో రాజీ అనేదే ఉండకూడదని స్పష్టం చేశారు. మంత్రుల సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు.


హైడ్రా అందుకే..
హైదరాబాద్ నగరంలో హైడ్రాను రంగంలోకి దించి అక్రమార్కులు చెరబట్టిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నామని, మూసివేసిన నాలాలు, పూడ్చిన చెరువులు, కుంటలను గుర్తించి, వాటికి పునర్వైభవం తెచ్చేందుకు పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కొందరు స్వార్థపరులు హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి ఫార్మ్ హౌస్‌లు కట్టుకున్నారని, వీరి చర్యల వల్ల పర్యావరణానికి చెప్పలేనంత నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ లెక్కల ప్రకారం అక్కడి నిర్మాణాలను తొలగించాల్సిందేనన్నారు. ప్రకృతిని చెరబడితే ఫలితం ఎలా ఉంటుందో ఈ వరదలను చూస్తే అర్థమవుతుందన్నారు.

కలెక్టర్లూ.. ఇక మొదలెట్టండి..
తెలంగాణలోని అన్ని జిల్లాలలోనూ హైడ్రా తరహా చర్యలకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దీని అమలుకు వీలున్నంత త్వరగా జిల్లా స్థాయిలో కార్యాచరణను రెడీ చేసుకుని, రంగంలోకి దిగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల కబ్జా, నాలాలు, చెరువులు, కుంటలు పూడ్చి కట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా అధికారులు రికార్డులు బయటికి తీసి చర్యలకు ఉపక్రమించాలన్నారు. త్వరలోనే వరంగల్ నగరంలోని ఆక్రమణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు వెల్లడించారు.

Also Read: Anchor Sreemukhi: నాటు అందాల ఘాటు చూపిస్తోన్న శ్రీముఖి.. ఫోజులు పిచ్చెక్కించాయ్

హరీశ్.. రెడీయా?
మీడియా చిట్‌చాట్‌లో భాగంగా సీఎం.. మాజీ మంత్రి హరీశ్ రావుకు మరోసారి సవాల్ విసిరారు. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు తొలగించడానికి సహకరించాలని, దీనికోసం నిజనిర్ధారణ కమిటీ వేసేందుకు సిద్ధమని.. దీనికి హరీశ్ సిద్ధపడాలని కోరారు. ‘నేనే మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను. గతంలో మీరే ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. నా సవాల్‌కు సమాధానం చెప్పి.. ఆ తర్వాత మా చిత్తశుద్ధిని ప్రశ్నించండి’ అని సవాల్ చేశారు. ఆక్రమించిన స్థలంలోనే పువ్వాడ ఆసుపత్రి కట్టారని, దాని తొలగింపుపై బీఆర్ఎస్ నేతలు సహకరించాలన్నారు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు వచ్చాయని, త్వరలోనే మున్నేరు రిటైనింగ్​వాల్​ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని అన్నారు. సర్వే ఆఫ్​ఇండియా మ్యాప్స్​ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బాగా పని చేశాడని హరీశ్ అంటున్నాడని, త్వరలోనే అందరి లెక్కలు తీస్తామని హెచ్చరించారు.

లక్షకోట్లున్నయ్‌గా.. ఓ రెండు తీయ్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భారీగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. అందుకే ఈ స్థాయిలో చెరువులు తెగాయని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వరద సాయంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలపైనా సీఎం తనదైన శైలిలో స్పందించారు. ‘కేసీఆర్ కుటుంబం వద్ద రూ.లక్ష కోట్లు ఉన్నాయి. అందులోనుంచి వరద బాధితుల కోసం ఓ రూ.2 వేల కోట్లు సీఎం సహాయనిధికి ఇవ్వొచ్చు కదా’ అని సెటైర్లు వేశారు.

Also Read: Khammam: బీఆర్ఎస్ నేతల ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత.. వాహనాలపై రాళ్లదాడి

ఈటెలా.. ఢిల్లీ పోదామా?
చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేయటంపైనా సీఎం స్పందించారు. ఆ నిధులను కేంద్రం నుంచి ఈటలే ఇప్పించాలని కోరారు. వరద బాధితులను ఆదుకోవటానికి కేంద్రం తక్షణం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫామ్‌హౌజ్‌లో పండలే..
తెలంగాణ చరిత్రలో ఎన్నడూ కనివినీ ఎరుగన్నంత ఉపద్రవం వరద రూపంలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం ఖమ్మంలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. తాను ఫామ్‌ హౌస్ లో పడుకున్నోడిలా కాదని పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. ‘పనికి మాలినోడు.. తలకాయ లేనోడు అమెరికాలో కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. 80,000 పుస్తకాలు చదివినోడు ఫామ్ హౌస్‌లో పండి, నోరు మెదపకుండా ఉన్నడు’ అని విమర్శించారు. తాను చెప్పిందే చేస్తానని.. చేసేదే చెబుతానని వెల్లడించారు. తక్షణ సాయంగా బాధితుల ఇంటికి బియ్యం, ఇతర నిత్యావసరాలతో పాటు పదివేల రూపాయలు పంపిస్తున్నానని తెలిపారు.

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×