EPAPER

Hydra Illegal Construction: హైడ్రా లక్ష్యమేంటి? కూల్చివేతలు చెబుతున్నదేంటి?

Hydra Illegal Construction: హైడ్రా లక్ష్యమేంటి? కూల్చివేతలు చెబుతున్నదేంటి?

గాజులరామారంలోని చింతల చెరువులో బఫర్‌ జోన్‌లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలు.. దేవేందర్ నగర్‌లో నిర్మించిన కొన్ని అక్రమ కట్టడాలు. జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌ లేఅవుట్‌లోని పార్క్‌ స్థలంలో నిర్మించి అక్రమ నిర్మాణాలు. తాజాగా రాజేంద్రనగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత. ఇలా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో.. ఆ నిర్మాణాలన్నింటిని నేలమట్టం చేస్తున్నారు అధికారులు.. మీరు ధైర్యంగా ఫిర్యాదు చేయండి. తర్వాత జరిగేది మేం చూసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఇలా రోజుకో చోట జరుగుతున్న ఆక్రమణల కూల్చివేతలు.. ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపైనే ఫోకస్ చేస్తున్నారు అధికారులు..

హైడ్రా డిపార్ట్‌మెంట్ మార్షల్స్.. DRF బృందాలు.. ఎక్స్‌కవేటర్లు.. పోలీసులు.. అవసరమైతే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ నేరుగా అక్కడికి వెళుతున్నారు. ఫిర్యాదు రాగానే.. ముందుగా స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్స్ వద్ద ఉన్న మ్యాపులు, సాటిలైట్ పిక్స్‌తో కంపేర్ చేసుకుంటున్నారు. ఒక్కసారి అక్రమ కట్టడమని తేలిందా.. దాని పని ఖతం.. నిజానికి గతంలో నోటీసులతోనే వ్యవహారం నిలిచిపోయేది. కానీ ఇప్పుడలా కాదు.. గంటల్లోనే వ్యవహారం ముగిసిపోతుంది..
ప్రభుత్వ విభాగాలన్ని ఏకతాటిపైకి రావడంతో.. అన్ని పనులు చకాచకా జరిగిపోతున్నాయి. దీంతో కబ్జాదారుల వెన్నులో వణుకు పుడుతోంది. చెరువులు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో,, ప్రభుత్వ స్థలాల్లో వేసిన లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరమే అని చెప్పాలి.


Also Read: రాఖీ పండుగ వేళ టీఎస్ఆర్టీసీ శుభవార్త

నిజానికి హైడ్రా అనే దానిని చాలా మంచి ఆశయంతో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఓ స్వతంత్ర వ్యవస్థ. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలన్ని దీని కిందకు వస్తాయి. ఈ పరిధిలో ఎలాంటి విపత్తు జరిగినా రక్షణ చర్యలు చేపట్టే బాధ్యత హైడ్రాకు ఉంటుంది. అది ఎలాంటి ప్రమాదమైనా కావొచ్చు. వాహన ప్రమాదాలను మొదలు పెడితే.. అగ్ని కావొచ్చు, వరదలు కావొచ్చు.. ఇలా ప్రమాదమేదైనా హైడ్రా రంగంలోకి దిగుతుంది. ఎట్ ది సేమ్ టైమ్.. అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా హైడ్రాదే.. దీనికి కావాల్సిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది హైడ్రాకు.. అందుకే అలాంటి ప్రమాదాలు, నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

అక్రమ కట్టడాల యజమానులకు ఇప్పటికే ఓ అల్టిమేటమ్ జారీ చేసింది. మీరు కట్టినవాటిని మీరే కూల్చేయండి. లేదంటే తాము వచ్చి కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదంటుంది. నాకు వాళ్లు తెలుసు.. వీళ్లు తెలుసు అని చెప్పి తప్పించుకునే చాన్స్‌ కూడా లేదు. తప్పు చేస్తే అనుభవించక తప్పదంటోంది. అయితే హైడ్రా మెయిన్‌ ఫోకస్ చెరువుల ఆక్రమణలపైనే ఉంది. భారీ వర్షాలు కురిసే టైమ్‌లో వర్షం కురిసే టైమ్‌లో నీరు చెరువులకే చేరుకోవాలి. కానీ ఈ చెరువుల ఆక్రమణల కారణంగా వరద నీరు రోడ్డుపైనే నిలిచిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్ని ముంపులో ఉండిపోతున్నాయి. అందుకే ముందు కబ్జా కోరల నుంచి మొదట చెరువులను విడిపించాలని డిసైడ్ అయ్యారు.దీనికి ప్రభుత్వం కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడంతో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×