EPAPER

HYDRA demolishing: రాజేంద్రనగర్‌‌లో హైడ్రా కూల్చివేతలు

HYDRA demolishing: రాజేంద్రనగర్‌‌లో హైడ్రా కూల్చివేతలు

HYDRA demolishing: గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లో కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. గగన్ పహాడ్‌లోని అప్పా చెరువు, మామిడి చెరువులోని అక్రమణలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు.


హైదరాబాద్ సిటీలో వర్షం పడుతున్నా అక్రమ కూల్చివేతలు మాత్రం ఆగలేదు. శనివారం కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. చెరువు ఏరియాను ఆక్రమించి వ్యాపార నిర్మాణాలు చేపట్టారు కొందరు వ్యక్తులు. శివారు ప్రాంతం కావడం ఒకటైతే, మరొకటి చెరువు నీరు ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

2020 ఆ ప్రాంతమంతా నీటితో అప్పా చెరువు కళకళలాడేది. మరుసటి ఏడాది అంటే 2021 లో అక్కడ షెడ్లు వెలిశాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు షెడ్లను నిర్మించారు. ఒకటి వాటర్ ప్యాకింగ్ కాగా, మరొకటి చాక్లెట్ల తయారీకి రెడీ చేశారు. ఆనాటి నుంచి నిన్నటివరకు వ్యాపార కార్యకలాపాలు కొనసాగాయి.


ALSO READ: స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్స్.. మార్పులు చేర్పులు.. పరిశీలించిన సీఎం రేవంత్

రోజురోజుకూ అప్పా చెరువును కబ్జా చేయడం గమనించిన స్థానికులు, హైడ్రాకు వరుసగా ఫిర్యాదులు చేశారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించారు. శాటిలైట్ చిత్రాలు, తర్వాత జలమండలి, రెవిన్యూ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. చెరువును కబ్జా చేసి ఆక్రమ కట్టడాలు కట్టినట్టు తేలిపోయింది.

శుక్రవారం రాత్రి జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు హైడ్రా అధికారులు. శనివారం ఉదయం నుంచి కూల్చివేతలు మొదలుపెట్టారు. వర్షం పడుతున్న ప్పటికీ కూల్చివేతలు ఏ మాత్రం ఆగలేదు.  మొత్తం నాలుగు షెడ్లను నేలమట్టం చేశారు.

కూల్చివేతలకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని అంటున్నారు నిర్వాహకులు.  90 లక్షలకు సంబంధించిన ఎక్విప్ మెంట్ లోపల ఉండిపోయిందని చెబుతున్నారు. గతవారం ఇదే రోజు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ని అధికారులు కూల్చివేయగా, ఈ వారం అప్పా చెరువు వంతైంది. వచ్చేవారం ఇంకా ఏ చెరువు అన్నది చూడాలి.

 

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×