EPAPER

Hydra demolished: హైడ్రా కూల్చివేతలు.. 20 ఎకరాల భూమి ఆక్రమణ.. ఎక్కడ?

Hydra demolished: హైడ్రా కూల్చివేతలు.. 20 ఎకరాల భూమి ఆక్రమణ.. ఎక్కడ?

Hydra demolished: కాలం కలిసి వస్తే.. నడిచి వచ్చే కొడుకు పుడతాడని పెద్దలు చెబుతారు. ఈ సామెత హైడ్రాకు అతికి నట్టు సరిపోతుంది. హైదరాబాద్ లేక్ సిటీలో చెరువులు, ఎఫ్‌టీఎల్‌లను కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. దీంతో రేవంత్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ రంగంలోకి దిగేసింది. అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపురం తండాలో కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా.


సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఐలాపూర్‌ తండాలో దాదాపు 20 ఎకరాల భూమిని ఆక్రమించారు. సర్వేనంబర్‌ 119లో గుర్తు తెలియని వ్యక్తులు సర్వే రాళ్లు వేశారు. దీనిపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.

ALSO READ: ఆ విషయంలో భేష్ అంటూ.. చంద్రబాబును పొగిడేస్తున్న కేటీఆర్


రెవిన్యూ, జలమండలి నుంచి డీటేల్స్ తీసుకున్నారు. భూములు అక్రమ పరిధిలో ఉన్నాయా లేవా అన్నది నిర్థారించుకున్నారు. వెంటనే కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అధికారులు ముందుగా సరిహద్దు రాళ్లను తొలగించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సాయంతో రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు.

అమీన్‌పూర్ మండలం ఐలాపురం తండాలో దాదాపు  20 నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాను చేశారు కొందరు వ్యక్తులు. రెండు రోజులుగా ప్లాట్ల గురించి రాళ్లు మొదలుపెట్టారు. ఎంక్వైరీ అనంతరం వాటిని కూల్చివేసినట్టు చెబుతున్నారు అధికారులు. ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ భూముల్లో ప్లాట్లు అమ్ముతామని చెబితే ఎవరూ నమ్మవద్దనివిజ్ఞప్తి చేశారు.

హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణకు ఛైర్మన్‌గా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రభుత్వం నియమించింది. దీనిద్వారా ఏడు జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణించనున్నారు. చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి చేపట్టించిన నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించింది.

ఇటీవల ఏపీ, తెలంగాణలో వరదలు బీభత్సం సృష్టించాయి. విజయవాడ, ఖమ్మం పట్టణాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. అక్రమ కట్టడాలవల్లే డ్యామేజ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో చెరువులను కబ్జా చేసినవారిపై చర్యలు చేపట్టింది హైడ్రా.

 

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×