EPAPER

Hydra demolish: హైదరాబాద్.. అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ఎక్కడ?

Hydra demolish: హైదరాబాద్.. అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా, ఎక్కడ?

Hydra demolish: హైదరాబాద్ సిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కన్నేసింది. చెరువు, లేక్‌లు, నాలాలు కబ్జాల చేసినవారిపై దృష్టి సారించింది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు హైడ్రాకు వెళ్లువెత్తాయి. ఈ క్రమంలో అటు వైపు ఫోకస్ చేశారు. చెరువులు, ఎఫ్‌టీఎల్ లను కబ్జా చేసిన ఇళ్లు నిర్మించుకున్నవారికి నోటీసులు ఇచ్చింది. తాజాగా రామ్‌నగర్ ప్రాంతంలోని మల్లెమ్మ‌గల్లీలో అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా.


కొన్నాళ్లుగా ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రోజుల కిందట హైడ్రా కమిషనర్‌కు స్థానికుల ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఇటీవల మల్లెమ్మ‌గల్లీలో అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన యంత్రాంగం, అక్కడి కల్లును పారబోసింది. లోపల సామాగ్రిని తొలగించింది. ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టింది. శుక్రవారం ఉదయం దాన్ని జేసీబీలతో కూల్చివేశారు. ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలు తీసుకోవడంపై స్థానికుల హర్షం వ్యక్తం చేశారు.


ALSO READ: కేసీఆర్,కవితల ప్రజాపోరాటం.. తండ్రీ కూతుళ్ల మాస్టర్ ప్లాన్ ఇదే

ఇదిలావుండగా చెరువులు, లేక్‌లు, నాలాలను అక్రమంగా నిర్మించిన వారిపై హైడ్రాకు ఫిర్యాదు అందాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందా? లేదా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. దాని తర్వాత చాలా ప్రాంతాల్లో కూల్చివేతలు ఉంటాయని చెబుతున్నారు.

మరోవైపు హిమాయత్‌సాగర్ వైపు హైడ్రా బుల్డోజర్లు చూస్తున్నాయి. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. దీనికి సంబంధించి వివిధ శాఖల నుంచి డీటేల్స్ తీసుకుంది హైడ్రా. అక్రమ నిర్మాణాలను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టింది. సినీ రాజకీయ ప్రముఖుల ఫామ్ హౌస్‌లు ఉన్నట్లు తేలింది.

ఇందులో అధికార-విపక్షాలకు చెందిన నేతల బంగ్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ హద్దులు ఎంత వరకు ఉన్నాయి? బఫర్ జోన్ లోపల, బయల ఎంత మేరా కబ్జాకు గురైంది? దీనికి సంబంధించిన వివరాలు సిద్ధం చేశాయని జలమండలి, రెవెన్యూ అధికారులను ఆదేశించింది హైడ్రా. వచ్చేవారంలో ఇక్కడ కూడా కూల్చివేతలు మొదలు కావచ్చన్నది అధికారుల మాట.

మరోవైపు అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. తొలిసారి ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రా నిర్ణయం తీసుకుంది. ఆ అధికారుల పేర్లు, చేసిన తప్పిదాలను ఆధారాలు సేకరించి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్ రామకృష్ణారావు, చందానగర్ సర్కిల్ ఉప కమిషనర్ సుధాంశు, చందానగర్ సర్కిల్ అసిస్టెంట్ అధికారి రాజ్ కుమార్, బాచుపల్లి ఎంఆర్ఓ చౌహాన్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ ఏడీ శ్రీనివాస్, హెచ్ఎండీఏ సహాయ ప్లానింగ్ అధికారి సుధీర్‌కుమార్ ఉన్నారు. వీరితోపాటు గండిపేట్ జలాశయంలోని కొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసింది.

 

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×