EPAPER
Kirrak Couples Episode 1

Hydra demolish: అమీన్‌‌పూర్‌.. కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

Hydra demolish: అమీన్‌‌పూర్‌.. కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

Hydra demolish: అక్రమ కట్టడాలపై హైడ్రా ఏమాత్రం వెనక్కి తగ్గేలేదు. సిబ్బందిని పెంచడంతో అక్రమార్కులపై కన్నెర్ర చేస్తోంది. తాజాగా అమీనర్‌పూర్‌లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.


అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కేవలం జీ ప్లస్ టూకి పర్మీషన్ తీసుకుని ఐదుగా నిర్మించడంపై మున్సిపాలిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోభాగంగా అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది. జీ +2 కోసం అనుమతులు తీసుకుని నాలుగు అంతస్తుల భవన నిర్మాణాలను నిర్మించారు కొందరు.

హైడ్రా ఆదేశాలతో అమీన్‌పూర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. దీంతో హైడ్రా దెబ్బకు అక్రమ కట్టడాలు చేసినవారి గుండెల్లో రైళ్లు పరుగెడు తున్నాయి. ఈ తరహా కట్టడాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలావరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారట. ఈ క్రమంలో సర్వే చేస్తున్నట్లు అంతర్గత సమాచారం.


మరోవైపు హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు నెటిజన్స్. పదేళ్లలో అప్పటి సీఎం కేసీఆర్ చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని కేసీఆర్ అందులో వివరించారు. అక్రమ కట్టడాలు కడితే కూల్చివేస్తామని క్లియర్‌గా చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మీడియా సపోర్టు చేయాలని, వినియోగదారులు డబ్బులు పాడు చేసుకోవద్దని కేసీఆర్ సూచన చేసిన వీడియో వైరల్ అవుతోంది.

బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అప్పుడు అలా చెప్పి, ఇప్పుడు చేస్తున్నదేంటని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Related News

KTR: ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్

Bigtv Free Medical Camp: తెలంగాణలో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 27 నుంచి.. వివరాలు ఇవిగో

CM Revanth Reddy: జాబ్‌ గ్యారెంటీతో ఉచితంగా ఖరీదైన కోర్సు.. రేవంత్ కీలక నిర్ణయం

KTR: మూసీ పేరుతో భారీ కుంభకోణానికి కుట్ర.. రూ.లక్షన్నర కోట్లా!

R Krishnaiah: కృష్ణయ్య ప్లాన్ ఏంటి? వరుసగా నేతల భేటీలు.. ఏం జరుగుతోంది?

KTR: బీజేపీ ట్రాప్‌లో కేటీఆర్‌, డామిట్.. కథ అడ్డం తిరిగింది?

Big Stories

×