EPAPER

Hydra Commissioner: జగన్‌కు నోటీసుల ప్రచారంపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఏం చెప్పారంటే..?

Hydra Commissioner: జగన్‌కు నోటీసుల ప్రచారంపై స్పందించిన హైడ్రా కమిషనర్.. ఏం చెప్పారంటే..?

Hydra Commissioner Reaction: ప్రస్తుతం రాష్ట్రంలో ఏ మూల విన్నా హైడ్రా గురించే భారీగా వినిపిస్తుంది. ఏ ఇద్దరు కలిసి ముచ్చటించినా హైడ్రా కూల్చివేతల గురించి మాట్లాడుతున్నారు. ఎన్ కన్వెన్షన్ లాంటి కట్టడాలను సైతం కూల్చివేసింది. చెరువు భూములు, నాలాల భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అనేదానిపై సర్వే చేసి గుర్తిస్తున్నారు. అనంతరం వారికి నోటీసులు ఇచ్చి వాటిని కూల్చివేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి హైడ్రా దూకుడుగా వెళ్తుంది. ఇటు సీఎం కూడా హైడ్రా విషయంలో తీవ్ర ఒత్తిడిలు వస్తున్నాయి.. అయినా కూడా వెనక్కి తగ్గేదేలేదంటున్నారు. అటు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా తన వర్క్ స్టైల్ ను చూపిస్తున్నాడు. నగర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎక్కడెక్కడా కబ్జా అయ్యిందో గుర్తిస్తున్నారు. వాటిని బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా టాపిక్ ప్రజెంట్ హైలెట్ గా ఉంది.


Also Read: రాజేంద్రనగర్‌‌లో హైడ్రా కూల్చివేతలు

కాగా, భారీగా అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించింది. వారికి నోటీసులు కూడా ఇచ్చింది. అందులో ప్రముఖుల ఇళ్లు, నిర్మాణాలు కూడా ఉన్నాయి. అందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన తిరుపతిరెడ్డి.. తన ఇల్లు అక్రమ నిర్మాణమని తేలితే ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడుచుకోవాలంటూ ఆయన పేర్కొన్నారు. కాకపోతే ఇంటిని ఖాళీ చేసేందుకు తనకు సమయం ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది హైడ్రా. అయితే, ఇటు తాజాగా నడుస్తున్న ప్రచారం ఏమంటే.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చిందంటూ భారీగా ప్రచారం నడుస్తున్నది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి తాను కూడా చూశానన్నారు. అయితే, అదంతా ఫేక్ ప్రచారమంటూ కొట్టి పరేశారు. ఏదైనా ఉంటే అందుకు సంబంధించిన వివరాలను తాము తెలియజేస్తామన్నారు.


ఇదిలా ఉంటే.. నగర వ్యాప్తంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడెక్కడా చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయో వాటిని గుర్తించి కూల్చివేస్తున్నారు. అందులో భాగంగా పటాన్ చెరులో కూడా ఆయన సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక సాకి చెరువును ఆయన పరిశీలించారు. అక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం జరిపారు. మొత్తం అక్కడ 18 అక్రమ నిర్మాణాలను ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏమంటే.. చెరువు వద్ద తూములను బంద్ చేసి ఓ సంస్థ ఏకంగా అపార్ట్ మెంట్ ను నిర్మించినట్లు స్థానికంగా ఆరోణపలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ అపార్ట్ మెంట్ ను కూడా రంగనాథ్ పరిశీలించినట్లు సమాచారం.

Also Read: స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్స్.. మార్పులు చేర్పులు.. పరిశీలించిన సీఎం రేవంత్

ఇటు అమీన్ పూర్ లో కూడా రంగనాథ్ పర్యటించారు. పెద్ద చెరువు, శంభుని కుంట, శంబికుంట, బంధం కొమ్ము, చక్రపురి కాలనీలో ఆయన పర్యటించారు. పలు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Related News

Traffic Restrictions: నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులారా బీ అలర్ట్!

Farmers: బ్రేకింగ్ న్యూస్.. రైతులకు భారీ శుభవార్త

KTR: రేవంత్ రెడ్డి… నీకు దమ్మంటే ఆ నిర్ణయం తీసుకో : కేటీఆర్

GHMC Elections: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

Bhatti: ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్టుకొంటూ పరువు తీస్తున్నారు: భట్టి

Maoists Encounter: మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

Amrapali: తీపి కబురు చెప్పిన ఆమ్రపాలి..

Big Stories

×