EPAPER

HYDRA: త్వరలోనే హైడ్రాకు విశేషాధికారాలు.. ఆర్డినెన్స్, అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు: రంగనాథ్

HYDRA: త్వరలోనే హైడ్రాకు విశేషాధికారాలు.. ఆర్డినెన్స్, అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు: రంగనాథ్

Hydra Commissioner Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తాజాగా పలు కీలక విషయాలను వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘హైడ్రా చట్టబద్ధతపై పలువురు ప్రశ్నిస్తున్నారు. హైడ్రా పూర్తిగా చట్టబద్దమైనదే. జీవో 99 ద్వారా జులై 19న హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్యనిర్వాహక తీర్మానం ద్వారా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. మరో విషయమేమంటే.. హైడ్రాకు చట్టబద్ధతను కల్పిస్తూ వచ్చే నెలలోగా ఆర్డినెన్స్ ను ప్రభుత్వం తీసుకురానుంది. దీంతో హైడ్రాకు విశేష అధికారాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఆరు వారాల తరువాత కూడా అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై హైడ్రా బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. దీంతో రాష్ట్రంలో హైడ్రా కీలకంగా మారనున్నది. టాస్క్ ఫోర్స్, గ్రేహౌండ్స్ తరహాలోనే హైడ్రా పనిచేస్తుంది. ఇటు ఇతర శాఖలు.. నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలకు కూడా హైడ్రా సహకారం అందించనున్నది’ అంటూ రంగనాథ్ పేర్కొన్నారు.


Also Read: వీకెండ్ @ ఖైరతాబాద్.. రేపటితో దర్శనాలు బంద్.. బడా గణేష్ పెద్దోళ్ల కోసమేనా ?

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో ఒకటి హైడ్రా ఏర్పాటు. హైడ్రాను ఏర్పాటు చేసినప్పటి నుంచి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తూ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటుంది. నగరంలో ఎక్కడా చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిసినా..? లేదా ఎవరైనా ఫిర్యాదు చేసినా వెంటనే అక్కడి వెళ్లి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాటిని కూల్చివేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో హైడ్రా సంచలనంగా మారింది. ఇటు ప్రజల నుంచి కూడా హైడ్రాకు భారీగా రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ విన్నా కూడా హైడ్రా గురించి టాపిక్ నడుస్తుంది. ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదిఏమైనా హైడ్రాపై ప్రభుత్వం వెనక్కితగ్గొద్దంటూ సూచిస్తున్నారు.


హైదరాబాద్ మహానగరంలో మాత్రమే కాకుండా హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. తమ ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయంటూ, వాటిని రక్షించేందుకు ఇక్కడ కూడా హైడ్రాను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను కాపాడాలంటూ భారీగా డిమాండ్స్ వస్తున్నాయి.

Also Read: రూ.1400 కోట్ల స్కామ్.. మాజీ సీఎస్‌కు సీఐడీ నోటీస్

ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే మాట్లాడుతూ.. హైడ్రా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదంటూ తేల్చిచెప్పారు. హైడ్రా దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో రాజకీయనేతలు, ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని, అయినా కూడా తగ్గేదిలేదంటూ నిర్మోహమాటంగా చెప్పేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గితే దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు ఇక్కడ కూడా నెలకొంటాయన్నారు. ఎప్పుడు వర్షాలు, వరదలు వచ్చినా కూడా ఆ రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకు కారణం చెరువులు, కుంటలను కబ్జా చేయడమేనని అన్నారు. అటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉండొద్దనే ఉద్దేశంతోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేశామని, ఈ విషయంలో ఎవ్వరేమనుకున్నా తనకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు.

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×