EPAPER

Goa Train: ఛలో గోవా.. ఇక హైదరాబాద్ నుంచి రైల్లో నేరుగా వెళ్లిపోవచ్చు.. ఎప్పట్నుంచంటే..

Goa Train: ఛలో గోవా.. ఇక హైదరాబాద్ నుంచి రైల్లో నేరుగా వెళ్లిపోవచ్చు.. ఎప్పట్నుంచంటే..

Hyderabad to Goa Train by IRCTC(Today latest news telugu): గోవా.. చాలా మందికి ఇష్టమైన టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇంకెంతో మందికి డ్రీమ్ టూరిజం స్పాట్. స్నేహితులతో, ఫ్యామిలీలతో కలిసి గోవా తీరంలో సేదతీరేవారెందరో ఉన్నారు. మన దేశస్తులో కాదు.. విదేశీయులు కూడా గోవా తీరాన రిలాక్స్ అవుతుంటారు. లాంగ్ వీకెండ్ వచ్చిందంటే చాలు.. అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలంటే వెంటనే గుర్తొచ్చే ప్లేస్ గోవా నే. ఇక్కడ కాస్ట్లీ లిక్కర్ కాస్త చీప్ గా దొరకుతుంది కాబట్టి.. లిక్కర్ ప్రియులు ఖాళీ దొరికితే చాలు ఈగల్లా వాలిపోతారు.


ప్రతీ ఏటా సుమారుగా 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తారు. వీరిలో 20 శాతం మంది తెలుగు పర్యాటకులే ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా గోవాకు చేరుకునే ట్రైన్ లేదు. ప్రస్తుతం, వారానికి 10 కోచ్‌లతో ఒక రైలు మాత్రమే ఉంది. ఇది సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్‌కు చేరుకుంటుంది. అక్కడ తిరుపతి నుండి మరో 10 కోచ్‌లతో కలిపి గోవాకు వెళ్లే కొత్త రైలును ఏర్పాటు చేస్తారు. అదనంగా.. వారానికి నాలుగు రోజులు కాచిగూడ నుండి యలహంక వరకు ప్రయాణించే నాలుగు కోచ్‌లు గుంతకల్‌లో షాలిమార్-గోవా రైలుకు అనుసంధానించబడ్డాయి.

Also Read: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు – ఈ ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు


ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైల్వేశాఖకు ఓ విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలు నడపాలని కోరారు. దీంతో కొత్త ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును ప్రకటించింది రైల్వేశాఖ. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా) వరకు రైలును ప్రారంభించనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మరో వారంరోజుల్లో ఈ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలును మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు నడవనుండటంతో.. గోవా లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవాను సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుంది. సికింద్రాబాద్ – గోవా బై వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాజిక్ రాక్, కుళెం, సాన్వోరియం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×