EPAPER

Hyderabad Shoping malls: హైదరాబాద్ లో మిడ్ నైట్ షాపింగ్ కు గ్రీన్ సిగ్నల్

Hyderabad Shoping malls: హైదరాబాద్ లో మిడ్ నైట్ షాపింగ్ కు గ్రీన్ సిగ్నల్

Hyderabad Shops and malls Up to 1 p.m midnight permitted cm Reventh reddy: చల్ చల్ రే చల్ మేరీ సాథీ..హమ్ బన్ గయే హైదరాబాదీ తన ఒడిలో చోటిచ్చే ఈ హైదరాబాదుకి సాటింకేది అంటూ అల్లు అర్జున్ హ్యాపీ మూవీ ద్వారా హైదరాబాద్ గొప్పతనాన్ని చాటాడు. ఇక్కడి కల్చర్ కు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే వేగంగా విస్తరించే సిటీల జాబితాలో హైదరాబాద్ కూడా చేరింది. ఫ్లై ఓవర్లు, మెట్రో రైళ్లు, అండర్ పాస్ వే లాంటి ఆధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకుంటోంది. విశ్వనగరం అని ఊరికే అనలేదు కదా. ఇలాంటి విశ్వనగరికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.


ఫ్యామిలీలకు హ్యాపీ

ఇకపై హైదరాబాద్ లో షాపులు అర్థరాత్రి దాకా బిజినెస్ చేసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులతో అవస్థలు పడుతున్న వారు ఆ సమయంలో షాపింగ్ లు చేద్దామంటే గంటల తరబడి ట్రాఫిక్ రూడ్లపై ఇరుక్కపోవాల్సి వస్తుంది. అందుకే అందరూ ఆన్ లైన్ షాపింగులకు అలవాటు పడిపోతున్నారు. కస్టమర్లు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో ఆన్ లైన్ సేవలు పొందుతున్నారు. కానీ ఇప్పటికీ షాపింగ్ కు వెళ్లి తమకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తే ఆ తృప్తే వేరు అనుకుంటుంటారు కొందరు. చక్కగా రెండు చేతుల్లో సంచులతో షాపింగ్ చేసి మధ్యలో రెస్టారెంట్లకు వెళ్లి తినేసి హ్యాపీగా ఇంటికి వస్తే ఆ కిక్కే వేరు అనుకుంటుంటారు కొందరు.


మద్యం షాపులకు అనుమతి లేదు

ఇప్పుడు అలాంటి వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. ఇకపై అర్థరాత్రి ఒంటిగంటదాకా షాపింగ్ మాల్స్ తెరుచుకునే ఉంటాయని అన్నారు. దీనితో అటు వ్యాపారులు, ఇటు కస్టమర్లు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. అయితే మద్యం దుకాణాలు, బార్లు వంటి వాటికి మాత్రం ఇంతకు ముందు టైమింగ్సే వర్తిస్తాయి. ఎందుకంటే దీనిని అవకాశంగా తీసుకుని మందు బాబులు అర్థరాత్రిళ్లు ఫ్యామిలీ సభ్యులను ఆందోళనలకు గురిచేస్తారు. పైగా పోలీసులకు కూడా డబుల్ డ్యూటీ అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాటికి అనుమతులు లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అయితే మెట్రో సర్వీసులు, బస్సు సర్వీసులు పొడిగిస్తారో లేదో ఇంకా ఆ శాఖలతో చర్చించలేదు.

ఒంటి గంట దాకా అనుమతి

హైదరాబాద్ పోలీసులు రాత్రి 11 అయిందంటే చాలు షాపులు మూసేయాలని అంటూ వ్యాపారులపై ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అసెంబ్లీలో సీఎం రేవంత్ దృష్టికి తీసుకువచ్చారు. దీని వలన చిరు వ్యాపారులకు కూడా మేలు చేసినవారవుతారని సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే ఆదేశాలు ఇచ్చారు పోలీసు శాఖకు. ఇకపై ఒంటిగంట దాకా షాపులు తెరుచుకోవచ్చని..తమ వ్యాపారాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చని సీఎం ఆదేశాలలో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×