EPAPER
Kirrak Couples Episode 1

Hyderabad: ‘ORR’పై పొలిటికల్ రేస్.. ఆ సొమ్మంతా అందుకేనా?.. గ’లీజు’ దందా?

Hyderabad: ‘ORR’పై పొలిటికల్ రేస్.. ఆ సొమ్మంతా అందుకేనా?.. గ’లీజు’ దందా?

Hyderabad: బంగారు గుడ్డు పెట్టే బాతు కథ తెలుసుగా. రోజుకో బంగారు గుడ్డు పెడుతుంటుంది ఓ బాతు. దురాశకు లోనైన రాజు.. ఆ బాతు కడుపులో ఇంకెన్ని గుడ్లు ఉన్నాయోనని కోసి చంపేస్తాడు. బాతు పోయే.. గుడ్లూ పాయే. ఇది కథ. ఇలాంటిదే ఓ ఆసక్తికర రాజకీయ స్టోరీ నడుస్తోంది తెలంగాణలో. బంగారు బాతులాంటి ORRను అడ్డగోలు ధరకు లీజు పేరుతో అమ్మేసుకున్నారంటూ విపక్షాలు ఉరుముతున్నాయి.


ఔటర్ రింగ్ రోడ్-ORR. హైదరాబాద్ చుట్టూ 8 వరుసల లేన్, 158 కిలోమీటర్ల దూరం. రోజూ లక్షన్నర వరకూ వాహనాల రాకపోకలు. ఇంతటి కీలకమైన రహదారి చుట్టూ రాజకీయ వివాదం. బంగారు గుడ్డు పెట్టే బాతును.. ఒకేసారి కోసుకు తిన్నారంటూ మండిపడుతున్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సైతం రంగంలోకి దిగి లెక్కలతో సహా కేసీఆర్‌ను కడిగేశారు. విపక్షాల ఆరోపణలు చూస్తుంటే.. గులాబీ బాస్ రింగులో ఇరుక్కున్నట్టే కనిపిస్తోంది.

రేవంత్‌రెడ్డి ఆరోపణలు ఇవే..
సుమారు 7వేల కోట్లకు.. ORRను 30 ఏళ్ల పాటు IRB అనే ప్రైవేట్ సంస్థకు లీజుకిచ్చింది సర్కారు. లక్ష కోట్లు విలువ చేసే ప్రాజెక్టును 7వేల కోట్లకు ఎలా ఇస్తారనేది రేవంత్ ప్రశ్న. ఐదేళ్లలోనే 7వేల కోట్లు వచ్చేస్తాయని.. అలాంటిది ఇంత తక్కువ సొమ్ముకు ఎలా కట్టబెట్టారని నిలదీస్తున్నారు. మూడు నెలల్లో దిగిపోయే కేసీఆర్.. 30 ఏళ్లకు ఓఆర్‌ఆర్‌ను ఎలా అమ్మేస్తారని.. లీజు వెనుక 1000 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. రూ.10 ఉండే టోల్‌ను ఇప్పటికే 40కి పెంచేశారని.. ఫ్యూచర్‌లో 100 చేయరనే గ్యారెంటీ ఏముందని మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఈ లీజు రద్దు చేస్తామని.. ఆ సంస్థపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


లెక్కలు ముందేసిన రఘునందన్‌..
ఇక, రఘునందన్‌రావు అయితే లెక్కలతో సహా విమర్శలకు దిగారు. ORRపై రోజుకు సుమారు 2 కోట్ల ఆదాయం వస్తుందని.. అంటే ఏడాదికి దాదాపు 720 కోట్ల రాబడి ఉంటుందని.. అలాంటిది ప్రభుత్వం రోజుకు కేవలం 67 లక్షలు.. ఏడాదికి 246 కోట్లు ఇచ్చేలా IRBకి ఓఆర్‌ఆర్‌ను కట్టబెట్టిందని ఆరోపించారు.

సర్కారు వెర్షన్..
టోల్, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ TOT పద్ధతిలో ఓఆర్‌ఆర్‌ నిర్వహణ లీజును IRBకి ఇచ్చామని సర్కారు చెబుతోంది. ఈ విధానంలో కోట్ చేసిన మొత్తాన్ని ఆ సంస్థ మొదటే సర్కార్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకేసారి 7 వేల కోట్లు వస్తాయనేది ప్రభుత్వం ఆశ. IRB ఇన్‌ఫ్రా.. స్టాక్‌మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీ అని.. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థకు ORRను లీజుకిచ్చామని చెబుతోంది.

సడెన్‌గా లీజుకివ్వడం అందుకేనా?
అయితే, ఇక్కడ మరో విమర్శ కూడా వినిపిస్తోంది. లీజు వెనుక వెయ్యి కోట్ల డీల్ జరిగిందని రేవంత్ ఆరోపణ. అసలే ఎన్నికల కాలం. ఖర్చులు అధికం. దేశంలోని విపక్షాలన్నిటికీ కేసీఆరే డబ్బులు పంపిస్తున్నారనే ప్రచారమూ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. పార్లమెంట్ ఎలక్షన్‌నూ ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. జాతీయ స్థాయిలో రాజకీయాలంటే ఉత్తినే అయిపోతాయా? ఎంత పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుందో తెలీదా?

బంగారు తెలంగాణలో బంగారు బాతు కథనా?..
తొమ్మిదిన్నర ఏళ్లగా ORRని లీజుకు ఇవ్వని కేసీఆర్ సర్కారు.. సరిగ్గా ఇప్పుడే.. ఎన్నికల సంగ్రామానికి ఆరు నెలల ముందే ఇలా కాసులు గలగల్లాడే చర్యలు చేపట్టడం అనుమానాస్పదమే అంటున్నారు. రేవంత్ చెబుతున్నట్టు.. తెరవెనుక వెయ్యి కోట్ల డీల్ జరిగిందా? సర్కారుకూ ఒకేసారి 7 వేల కోట్లు వచ్చి పడుతుండటంతో.. పెండింగ్ ప్రాజెక్టులు, పథకాలకు సర్దుతారా? ఇలా భూములు, రోడ్లు అమ్మేసుకువడమే బంగారు తెలంగాణనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్మేస్తున్నారు.

Related News

Real Estate Fraud: బూదాటి పాపం పండింది..! లెక్కలతో సహా ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్

Venkat Reddy: ఆ ప్యాలెస్ లోపెద్ద తిమింగలమే ఉంది

YS Jagan: జగన్‌ను లైట్ తీసుకున్న.. కొడాలి నానీ, వంశీ

Black Units Into Action: రంగంలోకి బ్లాక్ యూనిట్.. వణికిపోతున్న ఇజ్రాయెల్

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Kolikapudi Srinivasa Rao: ఇవేం పనులు.. పార్టీ నుండి కొలికపూడి సస్పెండ్..?

Balineni vs YV Subba Reddy: బావ.. నీ బండారం బయట పెడతా.. వైవీకి బాలినేని వార్నింగ్

Big Stories

×