Hyderabad police order: హైదరాబాద్ సిటీలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యంగా నగరంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధించినట్లు పేర్కొన్నారు.
ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు ఉంటాయన్నది ప్రధాన హెచ్చరిక. సిటీలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడానికి వీల్లేదన్నది అసలు పాయింట్. ఈ లెక్కన 144 సెక్షన్ అమల్లోకి వచ్చేసింది. U/S 163 BNSయాక్ట్ ప్రకారం నవంబర్ 28 వరకు ఆంక్షలు అమలు చేస్తారన్నారు. పోలీసు ఆదేశాలను గమనించిన అందరూ నడుచుకోవాలని సూచన చేశారు.
ALSO READ: జన్వాడ ఫాంహౌజ్ కేసు.. తీగలాగుతున్న పోలీసులు
అక్టోబరు 27 సాయంత్రం ఆరు గంటల నుంచి నవంబర్ 28 వరకు ఈ అంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతి యుత నిరసనలు, ధర్నాలకు మాత్రం అనుమతి ఉంటుందని ఆయా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో అంతటా నిరసన ప్రదర్శలకు బ్రేక్ పడినట్లైంది. పార్టీల ముసుగులు కొందరు అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నమాట.
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు U/S 163 BNS యాక్ట్ ప్రకారం పోలీస్ ఆంక్షలు
నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం
సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిషేధం
ఐదుగురికి మించి గుమికూడితే కఠిన చర్యలు
ఆదేశాలు జారీ… pic.twitter.com/DQmPGM1EaM
— BIG TV Breaking News (@bigtvtelugu) October 28, 2024