EPAPER

Hyderabad land grabbing gang arrest: అత్తాపూర్‌ లో భూకబ్జా గ్యాంగ్ అరెస్ట్, మారణాయుధాలు స్వాధీనం..

Hyderabad land grabbing gang arrest: అత్తాపూర్‌ లో భూకబ్జా గ్యాంగ్ అరెస్ట్, మారణాయుధాలు స్వాధీనం..

Hyderabad land grabbing gang arrest(Latest news in Hyd): భాగ్యనగరం పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది కబ్జారాయళ్ల వశమైనట్టే. ఇందుకోసం ప్రత్యేకంగా గ్యాంగ్‌లు తిరుగుతున్నాయి. తాజాగా అత్తాపూర్‌లో ల్యాండ్ కబ్జా‌కి వచ్చిన 9మంది సభ్యుల గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


జంట నగరాల్లో ఖాళీ స్థలాలు కనిపిస్తేచాలు కబ్జా అయిపోయినట్టే. ఖాళీ స్థలాలను సొంతం చేసుకునేందు కు రౌడీ‌షీటర్లు భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఆ తరహా వ్యవహారం ఒకటి అత్తాపూర్‌లో బయటపడింది. ఉప్పర్‌పల్లి అక్బర్ హిల్స్ ప్రాంతంలో ఐదు వందల గజాల భూమిలో కొందరు రాత్రివేళ నిర్మాణాలు చేపట్టారు. ఫక్రుద్దీన్ గ్యాంగ్ దీన్ని కబ్జా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళ ఈ గ్యాంగ్ మూమెంట్స్ అధికంగా ఉంది.

వాళ్లను గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగి రైడ్స్ చేశారు. దాదాపు 9మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పదునైన కత్తులు, గన్స్, హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ప్రాంతంలో ఆ గ్యాంగ్ డాగ్స్‌ను తీసుకురావడం, మరణాయుధాలు ఉంచడం, ఆ స్థలం చుట్టూ సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం స్పష్టంగా కనిపించింది.


బౌన్సర్లను ఏర్పాటు చేసుకొని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తోంది ఫక్రుద్దీన్ గ్యాంగ్. గతంలో ఈ గ్యాంగ్ నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. కొద్దిరోజుల కిందట శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్యాంగే ఇక్కడ కూడా కార్యకలాపాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌లో ఇద్దరు రియల్టర్లు ఉన్నారు.

ALSO READ: మూసీ ప్రక్షాళన మూసుకుపోయినట్లేనా?

ఫక్రుద్దీన్ గ్యాంగ్‌కు సంబంధించి ఇది మూడో వ్యవహారం. వీరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి విచారణ‌లో ఈ గ్యాంగ్‌కు సంబంధించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×