EPAPER

Hyderabad Pub Raid: మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడినవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే

Hyderabad Pub Raid: మణికొండ డ్రగ్స్ కేసు.. పట్టుబడినవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే

Manikonda drugs case today news(Latest news in Hyd): మణికొండలోని కేవ్ పబ్ లో టీజీ న్యాబ్ అధికారులు, రాయదుర్గం ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినిత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవ్ పబ్ లో పట్టుబడినవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే డీజీ నిర్వాహకుడు ఆయూబ్ తోపాటు మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లుగా తేలిందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలను తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే ఉన్నారన్నారు.


పబ్ లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేసి డ్రగ్స్ సేకరించినట్లుగా గుర్తించామన్నారు. 25 మందిపైనా ఎన్ డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బయట డ్రగ్స్ తీసుకునే పబ్ లోకి వచ్చినట్లుగా విచారణలో తేలిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశామని ప్రచారం చేశారని, పక్కా సమాచారం రావడంతో తెలంగాణ నార్కోటిక్, సైబరాబాద్, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు సోదాలు నిర్వహించారన్నారు.

Also Read: ప్రేమోన్మాది ఘాతుకం.. మైనర్ బాలిక గొంతు కోసి దారుణ హత్య


మాదక ద్రవ్యాలను ప్రోత్సహించినందుకు కేవ్ పబ్ ను సీజే చేశామని చెప్పారు. ఈ కేసులో పబ్ మేనేజర్ శేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఐటీ సంస్థలు వారి సిబ్బందికి డ్రగ్స్ తీసుకోవొద్దని అవగాహన కల్పించాలని సూచించారు. త్వరలో మిగిలిన పబ్ లలో కూడా సోదాలు నిర్వహిస్తామన్నారు. గతంలో కూడా ఈ పబ్ లో ఇలాంటి తరహా పార్టీలు జరిగాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. పబ్ యజమానులు నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం వస్తుందని డీసీపీ తెలిపారు.

Tags

Related News

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

×