EPAPER

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Hyderabad Metro’s X account hacked: మెట్రో ప్రయాణికులకు అలర్ట్. హైదరాబాద్ మెట్రో ఎక్స్ అకౌంట్‌ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హైదరాబాద్ మెట్రో ఎక్స్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో మెట్రో యాజమాన్యం అలర్ట్ అయింది. వెంటనే ఎక్స్ వేదికగా పోస్టర్ పంపుతూ మెట్రో ప్రయాణికులను అలర్ట్ చేసింది.


హైదరాబాద్ మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్‌కు గురైందని మెట్రో యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. తమ ఎక్స్ హ్యాండిల్ @Itmhyd హ్యాక్ అయిందని తెలియజేసింది. అందుకే ఎవరూ అకౌంట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించవద్దని కోరింది. త్వరలోనే అకౌంట్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం తెలిపింది. ఈ విషయంపై ప్రయాణికులకు సమాచారం చేరవేస్తామని, అప్పటివరకు ఎవరూ కూడా మెట్రో ఎక్స్ అకౌంట్ పేరిట వచ్చే పోస్టలుపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో హైదరాబాద్ మెట్రో చాలా యాక్టివ్‌గా పనిచేస్తుంది. ప్రతీ చిన్న సందర్భాన్ని సైతం వాడుకొని ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రత్యేక ఆఫర్లు తీసుకొస్తుంది. వీటిని ఎక్స్ వేదికగా ప్రయాణికులకు చేరవేస్తుంది. అయితే ఇలాంటి ఎక్స్ అకౌంట్ హ్యాక్ చేయడంతో మెట్రో యాజమాన్యం షాక్‌కు గురైంది.


అయితే, మెట్రో ఎక్స్ వేదికగా ఇప్పటికే చాలా ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో వచ్చిన సమాచారం ఆధారంగా ప్రయాణికులు ఆఫర్లు ఉపయోగించుకునే వెసులుబాటు ఉండేది. కానీ హైదరాబాద్ మెట్రో ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేయడంతో ప్రజలు నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో యాజమాన్యం గ్రహించి అలర్ట్ మెసేజ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు సంస్థల అధికారిక ఎక్స్ అకౌంట్స్ హ్యాక్‌నకు గురయ్యాయి. తమకు సంబంధించిన అకౌంట్స్ పనిచేయకపోవడంతో యూజర్లు సైతం నష్టపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో దీనిని కొంతమంది ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు ఎప్పుడూ ఏం జరుగుతుందోనని సంస్థలతోపాటు యూజర్లు ఆందోళన చెందుతున్నారు.

ఎక్కడో చోట నిత్యం కంపెనీలకు సంబంధించిన ఎక్స్ అకౌంట్స్ తో పాటు ఇతర వివరాలు హ్యాక్ గురవుతూనే ఉన్నాయి. దీంతో ఏం జరుగుతుందో ఎవరికీ ఏం అర్థం కావడం లేదు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా పర్సనల్ అకౌంట్స్ కంటే కంపెనీలకు సంబంధించిన అకౌంట్స్ నే హ్యాక్ చేయడం గమనార్హం. అందుకే సైబర్ అటాక్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ పలు సందర్భాల్లో హెచ్చరించింది.

Also Read:  సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

అయితే, ఎక్కువగా వ్యక్తిగత అకౌంట్స్ కంటే సంస్థలకు చెందని అకౌంట్స్ హ్యాక్‌నకు గురవుతున్నాయి. ఇందులో భాగంగానే హ్యాకర్లు హైదరాబాద్ మెట్రో రైలు అధికారిక ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. తర్వాత సైబర్ కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఫ్రాడ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఏకంగా ఆ సంస్థ అఫీషియల్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. దీంతో మెట్రో రైలు అలర్ట్ అయింది.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×