EPAPER

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెబాట?.. ఎందుకంటే..?

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెబాట?.. ఎందుకంటే..?

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెబాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఉద్యోగులు విధులు బహిష్కరించారు. మెట్రో రైలు టికెట్‌ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులు నిరసనకు దిగారు. రెడ్‌లైన్‌ టికెటింగ్‌ ఉద్యోగులు చాలామంది విధులకు దూరంగా ఉన్నారు. ఎల్బీనగర్‌ -మియాపూర్‌ మార్గంలోని మెట్రో స్టేషన్లలో ఆందోళన చేపట్టారు. ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని తెలిపారు. విధుల్లో ఉన్నప్పుడు రిలీవర్‌ సరైన సమయానికి రాకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం భోజనం చేయడానికీ సమయం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సంగం మందిపైగా ఉద్యోగులు విధులకు రాకపోవడంతో మెట్రో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో అన్ని మెట్రో స్టేషన్ల వద్ద టిక్కెట్ కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు ఉన్నాయి. అమీర్ పేట్ , ఎల్బీనగర్, మియాపూర్ స్టేషన్ల వద్ద రద్దీ మరింత ఎక్కువగా ఉంది.


హైదరాబాద్ మెట్రో.. నగరవాసులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి అందుబాటులో ఉన్న మెరుగైన రవాణా వ్యవస్థ. మెట్రో రైళ్లు ఐటీ ఉద్యోగులకు వరంలా మారాయి. చాలామంది కార్లు, బైక్ లను ఇళ్లకే పరిమితం చేసి మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఇతర రంగాల ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు కచ్చితమై సమయానికి గమ్యస్థానాలు చేరుకోవడానికి మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. 2017లో నగర వాసులకు అందుబాటులో వచ్చిన మెట్రో అతి తక్కువ సమయంలో నగరవాసులకు ఇష్టమైన ప్రయాణంగా మారింది. రెండేళ్లలో రోజూవారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఈ సంఖ్య 5 లక్షలకు చేరువతున్న సమయంలో కరోనా మహమ్మారి మెట్రోపై తీవ్ర ప్రభావం చూపించింది.

కరోనా సమయంలో హైదరాబాద్ మెట్రో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండటంతో రోజూ ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోయింది. మళ్లీ గత 6 నెలలుగా మెట్రోలో రద్దీ విపరీతంగా పెరిగింది. రోజూ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలు దాటింది. మెట్రో పలు మార్పులు చేసింది. గతంలో ఉదయం 6.30 గంటలకు తొలి మెట్రో అందుబాటులో ఉండేది. కొన్ని నెలల క్రితం నుంచి ఉదయం 6 గంటలకే మెట్రో రైలు స్టార్ట్ అవుతున్నాయి. రాత్రి సమయాన్ని పెంచారు. ఇప్పుడు చివరి మెట్రో స్టేషన్లలో ఆఖరి సర్వీసు రాత్రి 11 గంటలకు అందుబాటులో ఉంటోంది. ఇలా రోజూ దాదాపు 18 గంటలకు పాటు మెట్రోరైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటున్నాయి. పండగలు, ప్రత్యేక ఉత్సవాలు సమయాల్లో రాత్రివేళల్లో మెట్రో సర్వీసు టైమ్ పెంచుతున్నారు. వినాయక నిమజ్జనం రోజు అర్ధరాత్రి తర్వాత మెట్రో సేవలు అందించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంటకు చివరి మెట్రోను అందుబాటులో ఉంచారు. అలాగే హైదరాబాద్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరిగితే అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నాయి.


ఇక అనేక ఆఫర్లను మెట్రో రైలు ప్రకటించింది. మెట్రోకార్డు ద్వారా ప్రయాణించేవారికి టిక్కెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్నారు. ఆన్ లైన్ టిక్కెట్ బుక్ చేసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. పబ్లిక్ హాలీడేస్ , ఆదివారాల్లో ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. 59 రూపాయలతోనే ఒకరోజు అన్ లిమిటెడ్ జర్నీ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇలా ఎన్నోరకాలుగా మెట్రో సేవలు ప్రయాణికులు ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు టిక్కెట్ ధరలు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం కనీసం చార్జీ 10 రూపాయిలు ఉంది. దాన్ని 20 రూపాయలకు పెంచుతారని తెలుస్తోంది. అలాగే గరిష్ట చార్జీ 60 రూపాయలు ఉండగా.. ఈ ధరను 80కి పెంచనున్నారని సమాచారం. ఎందుకంటే గత ఐదేళ్లుగా ఒకే టారిఫ్ తో టిక్కెట్ రేట్లు ఉన్నాయి. ఒక్కసారి పెంచితే మరో ఐదేళ్ల వరకు టిక్కెట్ ధరలు పెంచడానికి వీల్లేదు. అందుకే కనీస ఛార్జీని 10 రూపాయలు, గరిష్ట ఛార్జీని 20 రూపాయులు పెంచాలని నిర్ణయించారు. మరోవైపు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,745.85 కోట్ల నష్టాన్ని మెట్రో ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఈ నష్టం రూ. 1,766.75 కోట్లుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మెట్రో చార్జీలు, ఇతర కార్యకలాపాలతో కలిపి మొత్తం ఆదాయం రూ. 357.15 కోట్లుగా వెల్లడించింది. అంతకుముందు ఏడాది ఈ ఆదాయం రూ. 227.95 కోట్గగా ఉందని తెలిపింది. అలాగే ఉద్యోగుల సమస్యపైనా మెట్రో యాజమాన్యం దృష్టి పెట్టి పరిష్కరించాలని ప్రయాణికులు కూడా కోరుతున్నారు.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Big Stories

×