EPAPER

Food adulteration : ఆహార కల్తీలో హైదరాబాద్ నెంబర్ వన్ .. నివేదికలో షాకింగ్ నిజాలు

Food adulteration : ఆహార కల్తీలో హైదరాబాద్ నెంబర్ వన్ .. నివేదికలో షాకింగ్ నిజాలు

Food adulteration : వీకెండ్‌లో అలా సరదాగా బయటకు వెళ్లి ఏదైనా రెస్టారెంట్‌లోనో, లేక హోటల్లోనో భోజనం చేయాలని అనుకుంటున్నారా ? అయితే మీ అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే .. డబ్బు సంపాదించడమే లక్ష్యం .. దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కిన పర్వాలేదు అన్నట్టుగా ఉంటోంది కొన్ని వ్యాపారుల తీరు – కొందరు వ్యాపారస్తుల తీరు . చివరకు కడుపుకు తినే తిండిని కూడా వదట్లేదు . నిత్యావసర వస్తువులు మొదలుకుని.. చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, ఐస్‌క్రీంలు కూడా కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.


తాజాగా నేషనల్‌ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో (NCRB) వెల్లడించిన నివేదిక ప్రకారం ఆహార కల్తీ నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 2022 ఏడాదికి గాను దేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు హైదరాబాదులోనే నమోదయ్యాయి. అందులో 246 కేసులు హైదరాబాద్‌‌లోనే ఉండటం గమనార్హం .
ఐసీపీ సెక్షన్లు 272 ,273,274,275,276, కేసులు నమోదయ్యాయి .

హైదరాబాద్ సిటీలో కల్తీ ఆహారం తయారుచేస్తున్న వారిపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి . నాణ్యతను పరిశీలించే దిక్కు కూడా లేదని ప్రజలు వాపోతున్నారు . ఆహారపదార్ధాల కోసం ఎలాంటి నూనెలు వాడుతున్నారో , వేడిచేసిన నూనెను ఎన్నిసార్లు వినియోగిస్తున్నారో కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి పరిస్థితుల్లో బయట ఫుడ్ తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .. తాజాగా ఇంట్లో వండుకొని తినడం మంచిదని ఆరోగ్యం పాడుచేసుకోవద్దని చెబుతున్నారు .


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×