EPAPER

Praja Darbar : ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌.. బారులు తీరిన జనం..

Praja Darbar : ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌.. బారులు తీరిన జనం..

Praja Darbar : తెలంగాణలో ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల హామీలను అమలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనం తమ గోడును చెప్పుకునేందుకు ప్రజాభవన్‌కు భారీగా తరలివస్తున్నారు. కిలో మీటర్ల మేర క్యూ కట్టి మరీ అర్జీల రూపంలో సీఎం ముందు తమ బాధను చెప్పుకుంటున్నారు. ఇక ఇవాళ కూడా ప్రజా దర్బార్‌ నిర్వహించనుంది సర్కార్‌. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభంకానుండటంతో జనం తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు.


మరోపక్క ప్రజా దర్బార్‌ను జిల్లాలకు కూడా విస్తారిస్తామని అంటున్నారు పలువురు కాంగ్రెస్‌ నేతలు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం మరింత ప్రాధాన్యత ఇస్తామని.. ఈ మేరకు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ప్రజా దర్బార్‌ను ప్రారంభించారు. వందలాదిగా జనం తరలివచ్చి కుప్పకుప్పలుగా అర్జీలను సమర్పించారు. వారు తమతో చెప్పుకున్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా అధికారులు రంగంలోకి దిగారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజలను పట్టించుకోలేదని.. కేసీఆర్‌ తీవ్ర అహంభావంతో నియంతృత్వ పాలన సాగించారన్నది విపక్షాల విమర్శలు. అందుకే తాను అధికారంలోకి వస్తే ఇందుకు భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. ఆ భరోసా మేరకు ప్రగతిభవన్‌ బ్యారికేడ్లు కూల్చి జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌గా మార్చారాయన. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరసటి రోజు నుంచే ప్రజా దర్బాన్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో దాదాపు రోజుకి 1500ల మంది తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.


Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×