Big Stories

TSPSC: అరెస్టుల్లో హాఫ్ సెంచరీ.. పేపర్ లీకేజీలో సిట్ దూకుడు..

tspsc paper leak

TSPSC paper leak latest news(Breaking news updates in telangana): టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో డొంక కదిలిస్తోంది సిట్. ఇప్పటికే 50 మందిని అరెస్ట్‌ చేయగా.. రానున్న రోజుల్లో మరింత మందిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖ డీఈ రమేష్ నుంచి దాదాపు 30 మంది వరకు ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో లభించిన సాక్ష్యాల ఆధారంగా అధికారులు రమేష్ ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను మాస్‌కాపీయింగ్‌ చేయించినట్లు గుర్తించారు. లీకేజీలో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను తన ఇంటికి దగ్గరలో ఉండే జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌కు ఇవ్వగా అతడు ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి అమ్మినట్లు గుర్తించారు.

- Advertisement -

ప్రస్తుతం రమేష్‌, సురేష్‌తో పాటు మొత్తం ఏడుగురిని కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తోంది సిట్‌. ఏఈఈ, డీఏవో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూసిన ఓ కాలేజీ ప్రిన్సిపల్‌ తో కలిసి రమేష్ ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని మాస్‌ కాపీయింగ్‌ కు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. ఒక్కొక్కరి నుంచి 30 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఏఈఈ క్వశ్చన్ పేపర్ ను మరో 30 మందికి అమ్ముకున్నట్లు విచారణలో తేలింది.

- Advertisement -

మరోవైపు సురేష్‌ సైతం 78 మందికి ఏఈఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించినట్లు సిట్ అనుమానిస్తోంది. విచారణలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ వారంలో మూకుమ్మడిగా పలువురిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News