EPAPER
Kirrak Couples Episode 1

Medak Church : మెదక్‌ చర్చి గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే..!

Medak Church : మెదక్‌ చర్చి గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే..!

Medak Church : మెతుకు సీమ మెదక్‌ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది మెదక్‌ చర్చి. ఈ చర్చి మెదక్‌ పట్టణానికే ఒక మైలురాయి లాంటిది. మెతుకుసీమలో కరవు రక్కసి తాండవం చేస్తూ.. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులతో అల్లాడుతున్న వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతో నాటి క్రైస్తవ గురువు వాకర్‌ ఫాస్నెట్‌ నిర్మించిందే ఈ మెదక్‌ సీఎస్‌ఐ చర్చి. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. ఎంతో మంది పర్యాటకులను ఆకర్షించే.. ఈ చర్చి ఆసియాలోనే అతిపెద్ద చర్చులలో ఒక్కటిగా పేరుగాంచింది.


బ్రిటిష్ వారి పాలనలో 1914 లో ఘుస్నాబాద్ ప్రాంతంలోని విశాల స్థలంలో చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా.. అది పది సంవత్సరాలు కొనసాగింది. దీని వాస్తు శిల్పి థామస్ ఎడ్వార్డ్ హార్దింగ్ క్యాతెడ్రాల్. ఈ చర్చి దాదాపు 5 వేల మందికి సరిపడే ప్రార్థనాలయం. క్రీస్తు జీవితంలోని క్రీస్తు జననం, శిలువ వేయడం, ఆరోహణ వంటి విభిన్న దృశ్యాలున్న స్టాయిన్ గ్లాస్ కిటికీలు ఇందులో ప్రత్యేకమైనవి. ఇందులో బెల్ టవర్ మరీ ప్రత్యేకమైంది. దీని ఎత్తు 53 మీటర్లు అంటే చార్మినార్ కంటే కూడా ఎత్తయిందన్న మాట. హైదరాబాద్ నగరానికే మకుటాయమానమైన చార్మినార్ కన్నా కూడా మించిన ఎత్తులో ఈ బెల్ టవర్ను నిర్మించడం నాటి నిజాంకు నచ్చలేదంటారు.

ఏదేమైనా 1924 నాటికీ అన్ని హంగులతో సిద్దమైన ఈ చర్చి క్రైస్తవ భక్తులనే కాదు దేశ విదేశ పర్యాటకులను కూడా ఆకర్శించింది. చర్చి లోపలకు, వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండలు రాశారు. ఈ ఐదు కాండాలకు గుర్తుగా ఐదు ద్వారాలు నిర్మించారు. ప్రధాన ద్వారానికి ఇరుపక్కల రెండేసి చొప్పున ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు లోపలకు వెళ్లాలి. చర్చి లోపల 40 స్తంభాలుంటాయి. పై కప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు ఏర్పాటు చేశారు. చర్చి లోపలికి వెళ్తుంటే 10 మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడి వైపు విద్యుత్‌ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్‌లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తున్నాయి.


భాగ్యనగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మెదక్ చర్చిని చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి నిత్యం అనేకమంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. అలాంటి ఘన కీర్తి ఉన్న ఈ చర్చి ప్రస్తుతం క్రిస్మస్‌ వేడుకలకు ముస్తాబైంది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్‌మస్‌ట్రీ, విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రిస్మస్‌ రోజు తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధన.. ఉదయం 9.30 గంటలకు రెండో ఆరాధనను ప్రారంభిస్తారు. ఈ వేడుకలకు తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్‌ దేశస్తులు కూడా వస్తారు.

Tags

Related News

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

Big Stories

×