EPAPER

Telangana Emblems: ఎవరి ముద్రలివి? చిహ్నాల వెనుక చరిత్ర ఏంటో తెలుసా?

Telangana Emblems: ఎవరి ముద్రలివి? చిహ్నాల వెనుక చరిత్ర ఏంటో తెలుసా?

Historical Story of Telangana Emblems(TS today news): తెలంగాణలో పదేళ్లుగా పాలన ఎలా సాగింది? కొందరి ఆలోచనలకు అనుగుణంగానే సాగింది. ఓ కుటుంబం చెప్పు చేతుల్లో జరిగింది. కొందరి అహంకారానికి కేరాఫ్‌గా మాత్రమే జరిగింది. అందుకే ప్రజలు వారిని సాగనంపారు. ప్రజాపాలన చేస్తారని నమ్మిన వారిని గద్దెనెక్కించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే మార్పులు మొదలయ్యాయి. రాచరికం ఆనవాళ్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. తెలంగాణ అంటే ఉద్యమాలకు నెలవు.. పోరాట పటిమకు కేరాఫ్‌.. త్యాగాలకు ప్రతీక.. అలాంటి తెలంగాణకు సంబంధించిన రాజముద్ర ఎలా ఉండాలి? ఎలాంటి రాచరిక ఆనవాళ్లు లేకుండా ఉండాలి. అందుకే పాత రాజముద్రకు రిపేర్లు మొదలుపెట్టింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఒక్కొక్కటిగా రాచరిక ఆనవాళ్లను చెరిపేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కొత్త లోగోకు సంబంధించిన డిజైన్‌ను బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా మీ ముందుకు తీసుకొచ్చింది. ఇందులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకసారి అవేంటో చూద్ధాం..


తెలంగాణ పాత లోగోను ఓసారి చూడండి.. అందులో కాకతీయ కళాతోరణం.. చార్మినార్ కనిపిస్తాయి.. నిజానికి ఇవి రెండు తెలంగాణను పాలించిన కాలంలో ఆ రాజులు నిర్మించిన కట్టడాలు. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌లో కనిపిస్తోంది. వీటితో పాటు నాలుగు సింహాల ముద్ర కనిపిస్తోంది. బట్ కొత్త లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించారు. వాటి ప్లేస్‌లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి గుర్తుగా నిర్మించిన అమరవీరుల స్థూపాన్ని చేర్చారు. అమరవీరుల స్మారకం అంటే 1969 తెలంగాణ ఉద్యమ పోరాట చిహ్నం.. నిజానికి ఇది తెలంగాణ ప్రజల త్యాగాలను గుర్తు చేసేలా ఉంది. అలాగే వ్యవసాయానికి పట్టం కట్టేలా మధ్యలో వరికంకులు ఉండేలా డిజైన్ చేశారు..

కొత్త లోగోలో అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో దేవనాగరి లిపి.. అంటే హిందీలో తెలంగాణ శాసన్‌ అని చేర్చారు. మాములుగా మనం తెలంగాణ సర్కార్‌ అంటాము. బట్ సర్కార్‌ అనేది కూడా రాచరికపు ఆనవాళ్లను సూచిస్తుందని దాన్ని కూడా శాసన్‌గా మార్చేసినట్టు తెలుస్తోంది. శాసన్ అంటే చట్టం.. ఇది రాజ్యంగ బద్ధంగా.. ప్రజాపాలన అనే అర్థం వచ్చేలా ఉంది. అందుకే ఇదే పదాన్ని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది.


Also Read: రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్, కేసీఆర్ చిక్కినట్టేనా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాత లోగోను తీసుకొచ్చినప్పుడే కొన్ని విమర్శలు వచ్చాయి. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల త్యాగాలు, అమరత్వం, పోరాట పటిమ అందులో కనిపించలేదన్న మాటలు వినిపించాయి. వేలాది మంది తెలంగాణ బిడ్డల త్యాగాలను స్మరించే అమరుల స్థూపం రాజముద్రలో లేకపోవడం రాచరిక చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉండటం నియంతృత్వ పాలనకు అద్దం పట్టిందన్న ప్రచారం జరిగింది. కానీ వినేవారు ఎవరు? తాము చెప్పిందే వేదం అన్న ధోరణి నడిచింది కదా.. అందుకే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే లోగోపై ఫోకస్ చేశారు. ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా మార్చేశారు.

కాదేది రాజకీయానికి అనర్హం.. ఇది తెలిసిందే కదా.. లోగో అలా బయటికి వచ్చిందో లేదో.. దీని చుట్టూ రాజకీయం మొదలైంది. బీఆర్‌ఎస్‌ నేతలు రంగంలోకి దిగారు. రాజముద్రలో చార్మినార్, కాకతీయ తోరణాన్ని ఎందుకు తొలగిస్తారంటూ ధర్నాకు దిగారు. చార్మినార్‌ ముందు ధర్నా చేపట్టారు కేటీఆర్.. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం అస్సలు సరికాదు.. ఇది కేటీఆర్ చెబుతున్న మాట..

అంతేకాదు హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది చార్మినార్ మాత్రమే అని.. కానీ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందంటూ ఆరోపిస్తున్నారు కేటీఆర్.. మొత్తానికైతే లోగో డిజైన్‌పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నదే ప్రభుత్వ అభిమతం.. సలహాలు, సూచనలు తీసుకునే ఇలాంటి వాటిని తీసుకొస్తే బెటర్ అనేది ప్రజల అభిప్రాయం.. ఏదేమైనా.. తెలంగాణ చరిత్ర అంటే నవాబులు, రాజులు కాదు. సగటు శ్రమజీవి, పోరాటం, అమరులు రేవంత్ ప్రభుత్వమైనా దీనిని గుర్తిస్తే బెటర్ అనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×