EPAPER

Software Sector @ Hyderabad: ఐటీ లో మనమే మేటి.. దటీజ్ హైదరాబాద్!

Software Sector @ Hyderabad: ఐటీ లో మనమే మేటి.. దటీజ్ హైదరాబాద్!

High Requirements in Software Sector at Hyderabad: హైదరాబాద్.. ఉరుకుల, పరుగుల నగరం.. బిజి బిజి బతుకుల సమరం.. కోట్ల మంది ఆశలకు డెస్టినేషన్.. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అని లేదు. ఎవ్వరొచ్చినా తన ఒడిలో చేర్చుకొని.. మళ్లీ తిరిగి వెళ్లనివ్వదు మన భాగ్యనగరం. గాజులు, షెహన్‌షాలు.. గోల్కోండ, చార్మినార్‌లాంటి ఘన చరిత్ర మాత్రమే కాదు.. ప్రపంచాన్ని కుగ్రామంలా మార్చేసిన టెక్నాలజీకి గ్లోబల్ డెస్టినేషన్‌ మన హైదరాబాద్.. ఇప్పుడింత ఎలివేషన్‌ ఎందుకంటే.. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ కొలువులు చేసే వారి మెడపై కత్తి వేలాడుతుంటే.. మన భాగ్యనగరం మాత్రం.. కొత్తవారిని రిక్రూట్‌ చేసుకోవడంలో దుమ్ము రేపింది కాబట్టి.. రండి ఆ డిటెయిల్స్‌ ఏంటో చూసేద్ధాం..


ప్రస్తుతం ఐటీ రంగంపై జరుగుతున్న ప్రచారం ఏంటి? ఐటీ రంగం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి కంపెనీలో ఉద్యోగాలను తొలగిస్తున్నారు. రిక్రూట్ చేసుకునే కంపెనీలు కూడా చాలా ఆచి తూచి చేపడుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి.. ఇండియాలో అయితే జాబ్ రిక్రూట్‌మెంట్స్ ఏకంగా 4 శాతం తగ్గాయి. బట్.. మన హైదరాబాద్‌ సిట్యూవేషన్‌ కంప్లీట్ రివర్స్.. ఐటీ జాబ్స్ హైరింగ్‌లో దూసుకుపోతుంది. ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు కంటే ముందుంది. 2023 ఏప్రిల్ నుంచి 2024 మధ్య కాలంలో హైదరాబాద్ ఐటీ ఉద్యోగాల పోస్టింగ్స్ .. 41.5 శాతం పెరిగింది… అదే బెంగళూరులో కేవలం 24 శాతం మాత్రమే..ఐటీ ఉద్యోగాలు ఆశించే వారికి ఈ రెండు నగరాలే హైలైట్‌గా కనిపిస్తున్నాయి.

జాబ్ మ్యాచింగ్,జాబ్ హైరింగ్ సంస్థ ఇండీడ్.. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో జాబ్ పోస్టింగ్స్ అండ్ జాబ్ క్లిక్స్ నుంచి ఈ డేటాను కలెక్ట్‌ చేసి అనలైజ్ చేస్తే ఈ వివరాలు తెలిశాయి.. అంతేకాదు హైదరాబాద్‌లో ఇంపార్టెంట్స్‌ ఇచ్చేవారి సంఖ్య ఏకంగా 161 శాతం పెరగగా.. బెంగళూరుపై ఇంట్రెస్ట్‌ చూపేవారి సంఖ్యలో 80 శాతం పెరిగింది. ఈ ట్రెండ్‌ను చూస్తే హైదరాబాద్ టెక్ ఎకో సిస్టమ్ ఎదుగుతుందని క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది.


Also Read: వైద్యో నారాయణో నకిలీ!

మరి హైదరాబాద్‌లోనే ఎందుకు రిక్రూట్‌మెంట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి మూడు రిజన్స్ ఉన్నాయి.. ఫస్ట్‌ రిజన్.. వల్డ్ క్లాస్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్.. యస్.. హైదరాబాద్‌లో ఒక్కసారి టూర్ వేసిన వారికి ఇది ఈజీగా అర్థమవుతోంది.. మల్టీ నేషనల్ కంపెనీలకు కావాల్సిన అన్ని వసతులు మన హైదరాబాద్‌లో వడ్డించిన విస్తరిలాగా అందుబాటులో ఉంటాయనడంలో ఎలాంటి డౌట్స్ లేవు.. సెకండ్ రిజన్.. హైల్లీ స్కిల్‌డ్‌ టాలెంట్‌ అందుబాటులో ఉండటం. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రెస్టేజీయస్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి మనకు.. ఇక్కడి నుంచి సూపర్ టాలెంట్‌తో పాటు.. హైల్లీ స్కిల్‌డ్‌ స్టూడెంట్స్‌ను హైర్ చేసుకుంటున్నారు రిక్రూటర్స్.. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వారందరి చూపు హైదరాబాద్‌వైపే ఉండటం కూడా మరో రీజన్.. ఇక థర్డ్ రీజన్.. ఫుల్‌గా సపోర్ట్‌ చేసే గవర్నమెంట్‌.. హైదరాబాద్‌లో కంపెనీ పెట్టాలని ఎవరైనా అనుకుంటే చాలు సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ దొరకుతాయి.. ఇది కూడా హైదరాబాద్‌లో కంపెనీలను ఎస్టాబ్లిష్‌ చేసేందుకు MNCలను అట్రాక్ట్ చేస్తోంది.

రిక్రూట్‌మెంట్స్‌ పెరుగుతున్నాయి ఓకే.. బట్ ఏఏ టెక్నాలజీకి సంబంధించి రిక్రూట్ చేసుకుంటున్నారు..? ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న టాప్‌ ఫైవ్‌ టెక్నాలజీలు ఏంటి? ఈ డిటెయిల్స్ ఓ సారి చూద్దాం.. అనాలసిస్ స్కిల్స్‌.. 5.51 పర్సెంట్.. అజైల్ 5.39 పర్సెంట్.. API.. 4.5 పర్సెంట్ జావా స్క్రిప్ట్.. 4 పర్సెంట్ SQL.. 4 పర్సెంట్.. సో సాఫ్ట్‌వేర్‌ రంగంలో సెటిల్‌ అవ్వాలనుకుంటున్న వాళ్లు వీటిపై కాస్త ఫోకస్ చేయండి.. ఇంకా బాగా సెటిల్‌ అవ్వాలనుకుంటున్న వాళ్లు ఏఐ టెక్నాలజీలపై ఫోకస్ చేస్తే.. భారీ జీతాలతో ఉద్యోగాలు సంపాదించవచ్చని చెబుతున్నారు ఐటీ ఎక్స్‌పర్ట్స్..

Also Read: Winning Tension In Kethireddy : మారిన లెక్కలు.. ధర్మవరంలో గెలిచేదెవరు?

ఇప్పుడు హైదరాబాద్‌ మరో అడుగు ముందుకు వేయబోతుంది. హైటెక్ సిటీ తరహాలో మరో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ప్యార్‌లల్‌గా 200 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. 2030 వరకు ఏఐ మార్కెట్‌లో 37.3 పర్సెంట్ వృద్ధి రేటుతో విస్తరిస్తుందని అంచనాలు ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికత, పరిశోధనా కేంద్రాలు,విద్యాసంస్థలు ఇందులో భాగం కానున్నాయి. ఈ సిటీలో ఇంక్యుబేటర్‌లు, స్టార్ట్-అప్‌లు, కార్పొరేట్‌ల కోసం గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్‌ ఇలా అన్ని అందుబాటులో ఉంచాలని చూస్తున్నారు. ఓవరాల్‌గా గోల్ ఏంటంటే… హైదరాబాద్‌ను ఏఐ క్యాపిటల్‌గా చేయడం. సో భాగ్యనగరం చారిత్రక నగరంగా ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో హైదరాబాద్‌గా గ్లోబల్‌ డెస్టినేషన్‌గా అంతే పేరు సంపాదించుకోంది.. సో.. Proud to be say .. హమ్ హైదరాబాద్ వాలే.

Tags

Related News

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Big Stories

×