EPAPER

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

High Court orders: తెలంగాణలోని బీఆర్ఎస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ ఆఫీసును కూల్చేవేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని కట్టడంపై అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై న్యాయస్థానానికి వెళ్లిన కారు పార్టీకి ఊహించని షాకు తగిలింది.


హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. 2018లో హైదరాబాద్ నుంచి నల్గొండకు వెళ్లే దారిలో రెండెకరాల స్థలంలో పార్టీ ఆఫీసును నిర్మించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం పూర్తి చేసింది. దీనిపై మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారు. 99 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు తీసుకుంది. ఏడాదికి గజానికి వంద రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది.

ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. బీఆర్ఎస్ ఆఫీసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ ఆఫీసును కట్టారని, దానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు నోటీసులు జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ క్రమబద్దీకరణకు అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించి 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది.


ఆఫీసు కట్టి ఐదేళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇప్పుడు రెగ్యులరైజ్‌ చేయడానికి అనుమతులు ఏంటని ప్రశ్నించింది. ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారో తెలీదన్నారు.

ALSO READ:  ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

ప్రభుత్వం వేసిన కౌంటర్‌లో మున్సిపల్ శాఖ అధికారుల నుంచి ఎలాంటి పర్మీషన్ తీసుకోలేదని ప్రస్తావించారు. అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని కాకుండా, పక్కనున్న కొంతమంది వ్యక్తుల భూములను సైతం తీసుకున్నారని పేర్కొంది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, చివరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ మార్కెట్‌లో ఆ భూమి విలువ అక్షరాలు 100 కోట్లు రూపాయలుగా ఉంటుందని ఓ అంచనా.

Related News

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Bandi Sanjay: ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి వదిలేస్తున్నా.. ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంటే ఊరుకోను: బండి సంజయ్

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Big Stories

×