EPAPER

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఈడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది సురేష్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఈడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది సురేష్

Phone Tapping CasePhone Tapping Case: సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను సంచలనంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు.


ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ బుధవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ టాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారస్తులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని న్యాయమూర్తి సురేష్ ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ పార్టీ డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించారని నిందితులు ఇప్పటికే ఒప్పుకున్నారని తెలిపారు.

నిందితులు వెల్లడించిన ఈ సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ పై ED PMLA ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అడ్వాకేట్ సురేష్ ఈడీని కోరారు. ఈ కేసులో అసలు నిందితులు ఇప్పటివరకు విచారించలేదన్నారు. ED కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనుకాల ఉన్న రాజకీయ నాయకులు బయటికి వస్తారని అన్నారు.


Also Read: కంటోన్మెంట్ బరిలో లాస్య నందిత సోదరి.. ఖరారు చేసిన కేసీఆర్..

అయితే ఈయన ఈడీకి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈడీ రంగప్రవేశం చేస్తే.. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ రాజకీయ నాయకుడి మెడకు చుట్టుకుంటుందోనని రాజకీయ చర్చ మొదలైంది.

 

Tags

Related News

Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న జగ్గారెడ్డి

Man on Charminar: చార్మినార్‌ పైకి ఎక్కిన వ్యక్తి… స్టంట్స్ చేస్తున్నాడా..?

Jaggareddy: నువ్వు ఢిల్లీ వెళ్లు… నేను మీ మామ ఫాం హౌస్‌ కు వెళ్తా.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్

Cm Revanth: రూ.1500 కోట్లు ఉన్నాయి కదా.. పేదలకు రూ.500 కోట్లు ఇవ్వండి.. బీఆర్ఎస్‌కు సీఎం సెటైర్

KTR Reaction: గబ్బు మాటలు మాట్లాడుతున్నారని కోర్టులో పరువు నష్టం దావా వేశా: కేటీఆర్

Nukala Naresh Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత నరేష్‌రెడ్డి ఇక లేరు

Big Stories

×