EPAPER

MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ.. జులై 30కి వాయిదా

MLAs Disqualification Case: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ.. జులై 30కి వాయిదా

MLAs Disqualification Case: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన ఫిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌషిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. బీఆర్‌ఎస్,  తరపున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరారు.


స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని సుప్రీం కోర్టు తీర్పులో ఉన్నా అమలు చేయలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ మేరకు పలు మార్లు కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా చదివి వినిపించారు. వాదనల విన్న కోర్టు జులై 30 వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

నేతల వలసలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతుండటంతో గులాబీ పార్టీకి  ఇది సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ బద్ధంగా ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. చట్టపరంగా అనర్హత వేటు పడేలా చేయడం ద్వారా భవిష్యత్తులో ఇతర శాసన సభ్యులు పార్టీని వీడకుండా కట్టడి చేయవచ్చని పార్టీ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్, తెల్లం వెంటట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరితో పాటు భవిష్యత్తులో ఇంకెవరైనా పార్టీని వీడినా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.


Related News

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

Big Stories

×