EPAPER

Hero Rajasekhar:అంకుశం హీరోకి అంత కష్టం ఏమొచ్చింది? నగర మేయర్ కు ట్వీట్

Hero Rajasekhar:అంకుశం హీరోకి అంత కష్టం ఏమొచ్చింది? నగర మేయర్ కు ట్వీట్

Hero Rajasekhar tweets to GHMC Mayor about Drainage leak :టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా హీరో రాజశేఖర్ కు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా పోలీసు పాత్రలలో జీవిస్తాడు. అంకుశం చిత్రంలో శిఖరాగ్ర నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వెల్లువ లభించింది. ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ హీరో పాత్రలే చేస్తూ ఒప్పిస్తున్నాడు. అయితే జగపతి బాబు, శ్రీకాంత్ ల మాదిరిగానే రాజశేఖర్ కు విలన్ అవకాశాలు వచ్చినా వాటిని ఇష్టపడటం లేదు. అలాగే తండ్రి పాత్రలు కూడా సున్నితంగా తిరస్కరిస్తున్నారు. రాజశేఖర్, జీవితల ఇద్దరు కూతుళ్లు సినిమాలలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు.శివాని, శివాత్మిక ఇద్దరూ కూడా కథానాయికలుగా నిరూపించుకున్నారు. గతేడాది నితిన్ హీరోగా వచ్చిన ఎక్సట్రార్డినరీ మూవీలో ఓ కేమియో రూల్ ప్లే చేశారు రాజశేఖర్. అది కూడా కామెడీ పోలీసు పాత్ర. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తనకు నచ్చిన క్యారెక్టర్ అయితేనే చేస్తానంటున్నారు రాజశేఖర్.


నగర మేయర్ కు కంప్లయింట్

రాజశేఖర్ జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 70 వద్ద అశ్విని హైట్స్ లో చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. స్వతహాగా వైద్యుడు అయిన రాజశేఖర్ వైద్య సలహాలు కూడా సన్నిహితులు, మీడియా వారికి ఇస్తుంటారు. అయితే ఇటీవల తమ నివాసం వద్ద తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ డ్రైనేజీ నీరు బయటకు లీకవుతోంది. ఎప్పటినుంచో జీహెచ్ ఎంసీ సిబ్బందిని ఆన్ లైన్ ద్వారా ఈ సస్యను పరిష్కరించాలని కోరుతున్నారు కాలనీ వాసులు. మురుగు నీరు నిల్వ వుండటంతో చుట్టుపక్కల దోమలు కూడా వ్యాపిస్తున్నాయి. దీనితో రాజశేఖర్ రంగంలోకి దిగి జీహెచ్ ఎంసీ మేయర్ విజయలక్ష్మి కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. చాలా రోజులుగా డ్రైనేజీ లీక్ వాటర్ దుర్గంధంతో కాలనీ వాసులు భరించలేకపోతున్నారని..ఇకనైనా జాప్యం లేకుండా పట్టించుకోవాలని సత్వరమే సమస్యకు పరిష్కారం చూపాలని రిక్వెస్ట్ చేస్తూ పోస్టును ట్యాగ్ చేశారు. డ్రైనేజీ లీక్ అవుతున్న ఫొటోను సైతం మేయర్ కు పోస్ట్ చేశారు. దీనితో సోషల్ మీడియాలో రాజశేఖర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. తన కోసమే కాకుండా పక్కనున్నవారి కోసం రాజశేఖర్ చేస్తున్న కృషికి అభినందనలు. సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరోగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×