EPAPER

Rain Alert : తెలంగాణకు వర్షసూచన.. హైదరాబాద్ సహా జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert : తెలంగాణకు వర్షసూచన.. హైదరాబాద్ సహా జిల్లాలకు ఎల్లో అలర్ట్

Heavy Rain Alert for Telangana(Today news in telangana) : భానుడి భగభగల నుంచి తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించింది. మొన్నటి వరకూ మండుటెండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు.. ఇప్పుడు వాతావరణం కాస్త చల్లబడటంతో సేదతీరుతున్నారు. మూడురోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. ఎర్రటి ఎండలకు అల్లాడిన ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో.. హైదరాబాద్ లోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది వాతావరణ శాఖ.


Also Read : డొంక కదులుతోంది, రేపోమాపో ఆ నేతలకు నోటీసులు..!

కాగా.. గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా తాడూరులో కరెంట్ షాక్ తో ఇద్దరు తోటికోడళ్లు మృతి చెందారు. ఇక అకాల వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. కోతకొచ్చిన వరితో పాటు.. మామిడి, జామకాయలు సైతం నేలరాలి రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. వడగళ్ల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా.. పంట పాడై నష్టపోతున్నామని వాపోతున్నారు రైతన్నలు.


తెలంగాణతో పాటు.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న గుంటూరులో వర్షం కురవగా.. తమిళనాడును కూడా వరుణుడు పలకరించాడు. మరో రెండు, మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది.

Related News

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Ram Charan : హాలీవుడ్‌లో అరుదైన గౌరవం… గ్లోబల్ స్టార్ అంటే ఇదే మరీ..!

CID Shakuntala: ఇండస్ట్రీలో విషాదం.. సిఐడి శకుంతల కన్నుమూత..!

Bigg Boss 8: చంద్రముఖిలా మారిన యష్మీ.. ఏడిపించేసిన విష్ణు

Big Stories

×