EPAPER
Kirrak Couples Episode 1

Heavy Rainfall: హైదరాబాద్‌లో భారీగా వర్షం… అటువైపు వెళ్తే మీ పని అయిపోయినట్టే!

Heavy Rainfall: హైదరాబాద్‌లో భారీగా వర్షం… అటువైపు వెళ్తే మీ పని అయిపోయినట్టే!

Heavy Rainfall in Hyderabad: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.


ఉప్పల్, ఎల్బీనగర్, తర్నాక, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, చైతన్యపురి, చార్మినార్, అఫ్జల్ గంజ్, మెహిదీపట్నం, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండపూర్, గడ్చిబౌలి, బోరబండ, మేడ్చల్, జగద్గీరిగుట్ట, చింతల్ తోపాటు నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉంది. అనుకోకుండా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఆ వెంటను భారీగా వర్షం కురిసింది. దీంతో నగరం తడిసిముద్దయ్యింది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

సాధారణంగా  సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తుంటారు కాబట్టి ఈ సమయంలో ట్రాఫిక్ అధికంగానే ఉంటుంది. వర్షం భారీగా కురుస్తుండడం, దీనికితోడు వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో వరద నీరు మొకాలు లోతు వరకు వచ్చి చేరినట్లు సమాచారం. దీంతో వాహనదారులు, ఇటు నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే, అప్పటికే అలర్ట్ గా ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు జీహెచ్ఎంసీ సిబ్బంది, ఇతర సంబంధిత విభాగాల సిబ్బంది కూడా రోడ్లపై నిలిచి ఉన్న వరద నీరును ఎప్పటికప్పుడు క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి

ఈ నేపథ్యంలో ఇటు నగర ప్రజలకు, అటు రాష్ట్ర ప్రజలకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వర్షం భారీగా కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు.

Related News

Ponguleti: కేటీఆర్.. నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు.. నేను రాజీనామా చేస్తా… లేకపోతే నువ్వు చేస్తావా? : పొంగులేటి

Yennam Srinivas Reddy: ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Minister Ponnam: ఆ సమయంలో నాకు చాలా ఆనందం వేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

Hyderabad: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

BJP Targets Rahul: మోదీజీ మీ స్థాయి ఇది కాదు: భట్టి విక్రమార్క

Big Stories

×