EPAPER

Heavy Rain: బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rain: బిగ్ అలర్ట్.. నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rain in telangana Today and Tomorrow: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


బంగాళాఖాతం వద్ద ఆవర్తనం ఏపీ తీరానికి దగ్గరగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో గంటకు 40-50 కి.మీల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు హైదరాబాద్‌, రంగారెడ్డి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సిద్ధిపేట, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండాల చెబుతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.


Related News

Vegetable Prices: సామాన్యుడిపై మరో భారం.. సెంచరీ చేరువలో ఉల్లి, టమాట

Minister Seethakka: వారి మరణానికి కారణం మీరు కాదా..? : ప్రధాని మోదీకి మంత్రి సీతక్క కౌంటర్

Scircilla: నేతన్నలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం… దసరా కానుకగా మీకు…

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

×