EPAPER
Kirrak Couples Episode 1

Rain: భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు.. బీఅలర్ట్..

Rain: భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు.. బీఅలర్ట్..
hyderabad rains

Rain: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అల్పపీడనం ప్రభావం కనిపిస్తోంది. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. మంగళ, బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


బుధవారం హైదరాబాద్‌లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని చెబుతోంది. ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని కోరింది. వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు DRF, GHMC సిబ్బందిని అలర్ట్ చేసింది ప్రభుత్వం.

భాగ్యనగరంపై వరుణుడు పగ పట్టినట్టున్నాడు. ఎడతెరపి లేని వర్షాలతో మహానగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ జామ్‌లతో నగరవాసులు నరకం చూశారు. కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా.. ప్రతీరోజూ వాన దంచికొడుతోంది. ఉదయం ఎండగా ఉందని బయటకు వస్తే.. సాయంత్రానికల్లా వాన కుమ్మేస్తోంది. ఇక అంతే. హైదరాబాద్ ఆగమాగం. ఇప్పటికే వారం గడిచేసింది. ఇంకా 4 రోజులు వానలు ఉంటాయని అంటుండటంతో.. వామ్మో అని హడలిపోతున్నారు హైదరాబాదీలు.


Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×