Fire Accident in Janagama :
⦿ జనగామ జిల్లా పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం
⦿ సిద్దిపేట రోడ్ లోని SR, విజయ షాపింగ్ మాల్స్ లో మొదలైన మంటలు తొమ్మిది షాపులకు విస్తరించాయి
⦿ అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైన షాపులు, మాల్స్
⦿ సుమారు రూ.15 కోట్ల ఆస్తి నష్టం
జనగామ, స్వేచ్ఛ : జనగామ జిల్లా పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట రోడ్ లోని SR, విజయ షాపింగ్ మాల్స్ లో మొదలైన మంటలు తొమ్మిది షాపులకు విస్తరించాయి. మొదట SR క్లాత్ స్టోర్ మొదటగా మంటలు వరుసగా.. విజయ షాపింగ్ మాల్ కు వ్యాపించాయి. శ్రీ లక్ష్మి, కార్తికేయ, కళింగ షాప్స్ సహా తొమ్మిది క్లాత్ స్టోర్స్, షాపింగ్ మాల్స్ కు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో షాపులు, మాల్స్ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.15 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇక 7 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో స్పందించకపోవడం మూలంగానే మంటలు వ్యాపించాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ సకాలంలో స్పందించి ఉంటే ఇన్ని షాపులు కాలిపోయేవికాదని తెలిపారు. ఇక షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అని అధికారులు అంటున్నారు.
ALSO READ : దీపావళి పార్టీనే రేవ్ పార్టీ.. కొకైన్ ఇచ్చింది పాకాలనే.. పోలీసుల ఎఫ్ఐఆర్ లో అన్నీ సంచలనాలే
రోజూ వారిలాగానే షాప్ రాత్రి పది తర్వాత మూసి వెళ్ళామని.. ఉదయం చూసే సరికి షాప్ లో నుండి పొగలు బయటికి వస్తున్నాయని తెలిపారు. అది చూసిన అగ్నిమాపక సిబ్బందికి చాలా సార్లు ఫోన్ చేశామని… వాళ్ళు వస్తున్నాం వస్తున్నాం అని చాలాసేపటి తర్వాత వచ్చామని అప్పటికే పొగలు ఎక్కువ వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు ఎగసి పడుతూ బయటికి వచ్చాయని.. అగ్నిమాపక సిబ్బంది త్వరగా వచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని అన్నారు. పది కోట్ల సరుకు పూర్తిగా మంటల్లో బూడిది అయిపోయిందని బాధితులు రోదిస్తున్నారు.