EPAPER

CM Revanth Reddy: గుండె కరిగిపోయే దృశ్యాలు.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్

CM Revanth Reddy: గుండె కరిగిపోయే దృశ్యాలు.. సీఎం రేవంత్ ఎమోషనల్ ట్వీట్

CM Revanth Reddy Emotional tweet about Floods: తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలమైంది. భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ప్రళయం సృష్టించింది. ఈ వరదలకు కొంతమంది మృత్యువాత పడగా.. జనజీవనం స్తంభించిపోయింది.


ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో 30 కి పైగా కాలనీలు నీటమునిగాయి. ఈ పరిస్థితులపై మొదట అధికారులతో సమావేశమైన సీఎం.. అనంతరం నేరుగా రోడ్డు మార్గంలో ఖమ్మంలో పర్యటించారు. ఈ మేరకు అక్కడి బాధితుల పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఖమ్మంలో ఎటుచూసిన గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే కష్టాలు కనిపించాయని చెప్పారు. వరద నీటిలో మునిగిపోవడంతో ఇంట్లోని వస్తువులు పాడైపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. నేను అక్కడ కష్టాలను స్వయంగా చూశానని చెప్పుకొచ్చారు. అలాగే బాధితుల మొఖాలలో ఓ వైపు తీరని ఆవేదన, మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా కనిపించిందన్నారు. వారి కష్టాలను స్వయంగా చూశానని అన్నారు. వీళ్ల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తెంగాణ ప్రభుత్వం ఎంతటి సాయమైనా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. వీళ్ల కష్టం తీర్చడానికి ఎంతటి సాయమైనా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


కాగా, అంతకుముందు మార్గమధ్యలో సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. అనంతరం వరద బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. అక్కడ వరదల ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. అలాగే వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన మోతీలాల్, అశ్విని కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం వెళ్లారు.

Also Read:  ఏడుపాయలను చుట్టుముట్టిన వరద.. ఆలయం మూసివేత

వరదలు బాధాకరమైన సందర్భమన్నారు. ఈ మేరకు ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సహాయం కింద రూ.10వేలు అందజేయాలని ఆదేశించారు. అలాగే పశువులు మరణిస్తే రే.50వేలు, ఇతర తీవ్రతను బట్టి రూ. 5వేలు అందించాలని చెప్పారు. దీంతోపాటు పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాలకు రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే వాటికి అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×