EPAPER

University Rankings : వరల్డ్‌ టాప్‌ వర్సిటీల జాబితా విడుదల..హెచ్‌సీయూ, ఐఐటీ–హైదరాబాద్‌ కు స్థానం..

University Rankings : వరల్డ్‌ టాప్‌ వర్సిటీల జాబితా విడుదల..హెచ్‌సీయూ, ఐఐటీ–హైదరాబాద్‌ కు స్థానం..

University Rankings :సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ –2023లో తెలంగాణ నుంచి రెండు యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. టాప్ 2 వేల యూనివర్సిటీల్లో దేశం నుంచి 64 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ 1,265వ ర్యాంకు, ఐఐటీ–హైదరాబాద్‌ 1,373వ ర్యాంకు దక్కించుకున్నాయి.


గతేడాదితో పోలిస్తే హెచ్‌సీయూ 7 ర్యాంకులు తగ్గింది. ఐఐటీ–హైదరాబాద్‌ ర్యాంకు మాత్రం మెరుగైంది. 68 స్థానాలుపైకి ఎగబాకింది. దేశంలో ఐఐటీ–అహ్మదాబాద్‌ 419 ర్యాంకుతో టాప్‌లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, ఐఐటీ–మద్రాస్‌ ఉన్నాయి.

వరల్డ్‌ టాప్‌ వర్సిటీల్లో హార్వర్డ్‌ యూనివర్సిటీ నంబర్‌వన్‌గా ఉంది. విద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల బోధన, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. పరిశోధనల్లో వెనుకబడటంతోపాటు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా దేశ యూనివర్సిటీలు వెనకబడ్డాయని సీడబ్ల్యూయూఆర్‌ నివేదిక వెల్లడించింది.


దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఘనత సాధించింది. ‘ది వీక్‌ హన్సా’ పరిశోధన సర్వే–2023లో దేశంలోని టాప్‌ 85 మల్టీ డిసిప్లినరీ వర్సిటీల్లో రాష్ట్ర, సెంట్రల్, ప్రైవేట్, డీమ్డ్‌ వర్సిటీల్లో హెచ్‌సీయూ నాల్గోస్థానంలో ఉంది. 2022లో ఐదో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది ఒక స్థానం పైకి ఎగబాకింది. దక్షిణాదిలోని టాప్‌ మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానం సాధించింది.

Related News

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

×