EPAPER

CM Revanth Reddy: రేవంత్ చెప్పాడంటే చేస్తాడంతే..!

CM Revanth Reddy: రేవంత్ చెప్పాడంటే చేస్తాడంతే..!

CM Revanth Reddy Latest News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పని అయిపోయింది. అధిష్టానం దగ్గర రేవంత్ పరపతి తగ్గిందని లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్స్ ఇవి. మరి నిజంగానే రేవంత్ రెడ్డి పరపతి తగ్గిందా? అంటే ఫలితాల తీరును ఓ సారి పరిశీలించాలి. కాంగ్రెస్‌కు 8 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనిపించలేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు, బీజేపీకి సమానంగా సీట్లు రావడంతో కొంతమంది రేవంత్ రెడ్డిపై ఈ ప్రచారం చేస్తున్నారు. కానీ.. రేవంత్ రెడ్డి ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు. వాస్తవాలకు దూరంగా మాట్లాడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌నే ప్రధాన ప్రత్యర్థిగా ఆయన భావించారు. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీనే టార్గెట్ చేశారు.


దమ్ముంటే ఒక్క స్థానంలోనైనా గెలవాలని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కానీ.. అదే సవాల్ బీజేపీకి చేయలేదు. ఎందుకంటే ఎవరి బలం ఏంటో రేవంత్ రెడ్డికి తెలుసు. ప్రత్యర్థి బలాన్ని అంచనా వేసుకునే రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా సీఎం స్థాయికి ఎదిగారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత రోజు కూడా కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. ఆయన చెప్పిన 9 నెంబర్ కంటే ఒకటి తగ్గి 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ విషయానికి వస్తే బీజేపీ కూడా 12 స్థానాల్లో గెలుస్తామని భావించింది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్ సభ ఎన్నికల ఫలితాలను పోల్చి చూడకూడదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్ద ప్రభావం చూపించదు. కానీ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం కనిపిస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. అదే కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కానీ.. 2023 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కంటే వెనకబడింది. అలా చూసుకున్నా.. ఈ సారి బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ పెర్పార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి.


Also Read: తెలంగాణ నుంచి ఇద్దరికీ అదృష్టం, మరి శాఖల మాటేంటి?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో 52 స్థానాలు గెలుచుకుంటే ఇప్పుడు 99 చోట్ల విజయం సాధించింది. అంటే.. 100 శాతం లోపే గ్రోత్ కనిపించింది. కానీ.. తెలంగాణలో 3 నుంచి ఎంపీల సంఖ్య 8కి చేరింది. అంటే.. 150 శాతం గ్రోత్ చూపించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మరిన్ని సీట్లు సాధించాలనే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ.. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అక్కడ క్లీన్ స్వీప్ చేసింది. గతేడాది కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ పైచేయి సాధించింది. అలా చూసుకున్నా కాంగ్రెస్ మంచి ఫలితాలే సాధించింది.

ఇక్కడ ఇంకో వెర్షన్ కూడా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటకలో బీజేపీ బలంగా ఉందని.. కానీ, తెలంగాణలో బీజేపీకి అంత బలం లేదని కూడా అనే వాళ్లు ఉన్నారు. కొంతమేర ఈ వాదనలో కూడా నిజం లేకపోలేదు. కానీ.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి సిఫ్ట్ అయ్యాయి. సిఫ్ట్ అయ్యాయి అనడం కంటే.. బీఆర్ఎస్ నేతలే బీజేపీకి సిఫ్ట్ చేశారని చెప్పడం కరెక్ట్. ఓటింగ్ పర్సెంట్ చూస్తూ ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది.

Also Read: KTR Failures: కేటీఆర్ సీన్ రివర్స్.. ఇక చాల్లే.. తప్పుకో.. అని ట్రోలింగ్

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వచ్చిన ఓటింగ్ శాతాన్ని 39 నుంచి 40కు పెంచుకుంది. కానీ.. బీఆర్ఎస్‌కి అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓటింగ్ రాగా.. పార్లమెంట్ ఎన్నికల్లో 17 శాతానికి పడిపోయింది. అంటే ఏకంగా 20 శాతం ఓట్లను బీఆర్ఎస్ నష్టపోయింది. అదే సమయంలో బీజేపీ ఓటింగ్ 14 నుంచి 35 శాతానికి పెరిగింది. అంటే.. బీఆర్ఎస్ కోల్పోయిన 20 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. తమ పార్టీ ఓట్లు బీజేపీకి పడేలా అధిష్టానం నుంచే క్షేత్రస్థాయి నాయకులకు సందేశం పంపారని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలతో కాంగ్రెస్‌కి, రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టం లేదు. కానీ.. కేసీఆర్ చేసిన వ్యూహాత్మక తప్పిదం ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీసింది. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు బీఆర్ఎస్‌ను కేసీఆర్ ఆత్మ బలిదానం చేశారు.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×