EPAPER

Harish Rao Tweet : మీరిచ్చిన ఉద్యోగాలన్నీ మావే – హరీష్ రావు

Harish Rao Tweet : మీరిచ్చిన ఉద్యోగాలన్నీ మావే – హరీష్ రావు

Harish Rao Tweet :  తెలంగాణలో అధికారం రావడం కోసం లెక్కకు మించి హామిలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటి అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. తాము తెలంగాణాలో అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో.. దానికి కౌంటర్ గా హరీష్ రావు ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.


బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పరిపాలనలో 1 లక్షా 61 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న హరీష్ రావు.. ముఖ్యమంత్రి హోదాలో అసత్యాలు ప్రచారం చేయడం దుర్మార్గమంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత నియమించామని గొప్పగా చెప్పుకుంటున్న 50 వేల ఉద్యోగాలను.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినవేనని గుర్తుచేశారు. కేసీఆర్ నేతృత్వంలోనే ఆయా ఉద్యోగాల నోటిఫికేషన్, పరీక్షల నిర్వహణ సహా.. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అప్పుడే అయిపోయిందన్నారు. ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో అప్పుడు నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తు చేసిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కేవలం అపాయింట్ మెంట్ లెటర్లు మాత్రమే అందించారన్నారు. అంత మాత్రాన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఆయా ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదని అన్నారు.

ఉద్యోగాలు సహా మిగతా విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతున్నారన్న హరీష్ రావు.. రేవంత్ తప్పుడు మాటలతో తెలంగాణ ప్రజలతో పాటు మొత్తం దేశ ప్రజల్నే తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని ఆగ్రహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల్ని ఎంత మేరకు నెరవేర్చారంటూ నిలదీసిన హరీష్ రావు.. ఇది నిజం కాదా.? అంటూ కొన్ని ప్రశ్నల్ని సంధించారు. అధికారం చేపట్టిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని అన్నారు. చెప్పిన ఉద్యోగాల్లో కనీసం 10% ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు.


రుణమాఫీ విషయంలోనూ రేవంత సర్కార్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందంటూ ఆగ్రహించిన హరీష్ రావు.. డిసెంబరు 9, 2023 నాటికి రైతులు బకాయి పడ్డ రూ. 2 లక్షల మేర రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నట్లుగా అర్హులైన రైతుల్లో సగం మందికి కూడా లబ్ధి చేకూరలేదని అన్నారు. ఇంకా సగానికి పైగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.

వృద్ధాప్య పింఛన్ ను నెలకు రూ.4 వేలు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి 11 నెలల దాటినా ఇంకా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆగ్రహించారు.
అధికారం కోసం ఎన్నో హామిలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిలో ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పారని.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు.

విద్యార్థులకు హామీ ఇచ్చినట్లుగా ఒక్కో విద్యార్థికి రూ. 5 లక్షల భరోసా కార్టులు ఏమయ్యాయన్నారు.రాష్ట్రంలోని ప్రతీ పంటకు బోనస్ ఇస్తామని వాగ్దానాన్ని .. తుంగలో తొక్కి, కేవలం వరి రకాలకే ప్రీమియం చెల్లించడం ఏంటని అన్నారు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు వాగ్దానం చేసినట్లుగా 10 గ్రాముల బంగారం పంపిణీ ఎప్పుడు మొదలుపెడుతున్నారని అడిగిన హరీష్ రావు..100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి మాట తప్పిందని.. అధికారంలోకి వచ్చి 300 రోజులు గడిచినా వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు.

చెప్పిన హామీలు నెరవేర్చకపోగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేసిన, రైతు బంధు, దళిత బంధు, BC బంధు, కేసీఆర్ కిట్, పోషకాహార కిట్, ప్రభుత్వంలో అల్పాహార పథకం, బతుకమ్మ చీరలు సహా మరెన్నో కార్యక్రమాల్ని నిలిపివేసిందని.. గుర్తుచేశారు.

Also Read :చీకట్లు తొలగించి.. వెలుగులు నింపుతున్నాం, మోడీకి సీఎం రేవంత్.. దిమ్మతిరిగే రిప్లై

తన ట్వీట్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ట్యాగ్ చేసిన హరీష్ రావు.. ఇన్ని అపజయాలను విజయాలుగా తప్పుగా ప్రచారం చేస్తోందన్నారు. పైగా.. ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ అక్కడి ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహించారు.

Related News

Caste Census Survey: బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే

Formula E Race Scam: ఫార్ములా రేస్ స్కామ్.. ఏసీబీ దర్యాప్తు వేగవంతం, రేపో మాపో నోటీసులు

Rahul Gandhi: హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. కులగణనపై చర్చ, ఆపై

CM Revanth Reddy: బర్త్ డే రోజున పాదయాత్ర.. మూసీ పునరుజ్జీవంపై దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తాం – విద్యార్ధులకు సీఎం రేవంత్ హామీ

Congress : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా.. సాఫీగా జరగాల్సిందే – సీఎం రేవంత్

BC Commission : రిజర్వేషన్స్ కమిషన్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన బీసీ నేతలు

Big Stories

×