EPAPER

Harish Rao Resign: రాజీనామాకు నేను రెడీ.. హరీశ్ రావు ప్రతిసవాల్

Harish Rao Resign: రాజీనామాకు నేను రెడీ.. హరీశ్ రావు ప్రతిసవాల్

Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మకంగా రైతు రుణమాఫీ చేస్తున్నది. ఏకకాలంలో రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా రాష్ట్రమంతటా సంబురాలు చేసుకుంటున్నాయి. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రైతు రుణమాఫీ ప్రకటించారు. ఆ హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్షరాల ఆచరణలో పెడుతున్నది. అయితే, రైతు రుణమాఫీ సాధ్యం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయపూనుకుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గతంలో విమర్శలు సంధించారు. అంతేకాదు, గన్ పార్క్ వద్దకు వచ్చి రాజీనామా లేఖను కూడా మీడియాకు ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేపడుతుండటంతో హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఆయన సవాల్‌ను గుర్తు చేస్తున్నారు. అయితే, హరీశ్ రావు కూడా సంచలనంగా రియాక్ట్ అయ్యారు. తాను రాజీనామాను రెడీ అని, కానీ, రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలనే షరతు పెట్టారు.


ఈ రోజు రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపైనా స్పందించారు. రైతు రుణమాఫీ చేస్తే హరీశ్ రావు రాజీనామా చేస్తానని గతంలో హడావుడి చేసిన ఘటనను గుర్తు చేశారు. అయితే, తాను హరీశ్ రావు రాజీనామాను డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ, ప్రతిపక్షం ఒక విషయం గుర్తుంచుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని ఎప్పటికీ మరిచిపోవద్దని సూచించారు. సాహసోపేత నిర్ణయాలైనా మాట ఇస్తే తప్పకుండా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వ సొంతం అని, గాంధీ కుటుంబం మాటకు కట్టుబడి ఉంటుందని వివరించారు.

మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తన పాత సవాల్‌పై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిసవాల్ చేశారు. తాను తన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాజీనామాకు ఇప్పటికీ రెడీ అని స్పష్టం చేశారు. పంద్రాగస్టులోపు రైతులందరికీ రూ. 2 లక్షల పంట రుణమాఫీతోపాటు ఆరు గ్యారెంటీలు (ఇందులోని 13 హామీలు) అమలు చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని చెప్పారు. తాము ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు రాజీనామాలు చేశామని, ఎంపీ, ఎమ్మెల్యేల పదవులను తృణప్రాయంగా ఉద్యమం కోసం విడిచిపెట్టామని వివరించారు. తాము ఎప్పుడూ రాజీనామాలకు వెన్ను చూపలేదని, ప్రజా పక్షాన ఎప్పుడూ నిలబడేది తామేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీతోపాటు అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×