EPAPER

Harish Rao: రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్.. మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao: రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్.. మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao Fire on Congress: రేవంత్‌ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల హౌసింగ్ అరెస్ట్ నేపథ్యంలో కోకాపేటలోని తన నివాసంలో హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.


హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రభుత్వం తీరు కనిపిస్తోందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడితే.. కార్యకర్తలు, నాయకులు కూడా అలాగే మాట్లాడుతున్నారన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని, గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఇది గాంధీ చేసిన దాడి కాదని.. రేవంత్ రెడ్డి చేసిన దాడి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ పాలనలా కనిపిస్తుందన్నారు.


బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారని చెప్పారు. నిన్న అరెకపూడి గాంధీని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదని, ఒకవేళ అరెస్ట్ చేసింటే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగేదా? అన్నారు. ఇది రేవంత్ రెడ్డి అజెండా అని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

14 ఏళ్ల ఉద్యమ కాలంలోనే ఇలాంటి అణిచివేత చూడలేదని, ప్రస్తుతం ఎమర్జెన్సీ పాలనలా ఉందని విమర్శలు చేశారు. డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. గతంలో పోలీసులను తిట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది అన్నారు.

Also Read: కౌశిక్‌రెడ్డిని ఆ పార్టీ నేతలు రెచ్చగొడుతున్నరు.. నీ కెపాసిటీ ఎంతో మాకు తెలుసు!

రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తూ లెక్చర్లు ఇస్తున్నారని, స్వేచ్ఛ, న్యాయంచ ధర్మమని మాట్లాడుతున్నారన్నారు. దేశంలో మీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడాలన్నారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణకు కారణం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేల ఫిరాయింపు, పీఏసీ చైర్మన్ నియామకం వంటి రాజ్యాంగ ఉల్లంఘటనల నుంచి దృష్టి మరల్చడానికి లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా చేస్తున్నారన్నారు.

గతంలో ఎవడ్రా మీరు అని పోలీసులను తిట్టిన ఘనత మీదే అన్నారు. కానీ ఇప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తుంటే సహకరిస్తున్నామని చెప్పారు. అందుకే పోలీసులు రేవంత్ మాటలను గుడ్డిగా ఫాలో కాకండి అని సూచించారు. విచక్షణతో వ్యవహరించాలని, చట్టాన్ని గౌరవించడంతోపాటు చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలన్నారు.

Related News

Kavitha: కవిత మౌనమేల.. దూరం పెట్టారా.. ఉంచారా..?

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×