EPAPER

Harishrao: ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం.. రాత్రి 12 అయినా కదలం: హరీశ్‌రావు

Harishrao: ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం.. రాత్రి 12 అయినా కదలం: హరీశ్‌రావు

Harishrao Comments: సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైబరాబాద్ సీఫీ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఇక్కడి నుంచి కదలబోనంటూ పేర్కొంటున్నారు. అయితే, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద జరిగిన ఇష్యూపై ఫిర్యాదు చేసేందుకు ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీపీ ఆఫీసుకు వచ్చారు. అనంతరం సీపీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘దాడి ఘటనపై జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశాం. ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు ఇక్కడే ఉంటాం. రాత్రి 12 అయినా కదలం. గాంధీ, అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. తక్షణం అరెస్ట్ చేయాలి, విచారణ జరపాలి. అరెస్ట్ చేయకుంటే కోర్టుకువెళ్తాం. ఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష జరపాలి. ఢిల్లీలో రాహుల్ ఇంటి ఎదుట ధర్నా చేస్తాం. సిద్ధిపేటలో నా ఆఫీసుపై కూడా దాడి చేశారు. ఖమ్మంలో మాజీ మంత్రుల కార్లపై కూడా దాడి చేశారు. నల్లగొండలో మా ఎమ్మెల్యేలపై దాడి చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడి చేసినవారికి మర్యాదలు చేస్తున్నారు.


Also Read: పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే?

సైబరాబాద్ సీపీతో మూడుసార్లు ఫోన్ మాట్లాడా. యాక్షన్ తీసుకుంటానని సీపీ చెప్పారు. ఉదయం నుంచి జరుగుతున్న వ్యవహారం సీపీకి తెలియదా? సీఎం డైరెక్షన్ లో పోలీసులు పనిచేస్తున్నారు’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.


Also Read: సీపీ ఆపీస్ వద్ద హైటెన్షన్.. పోలీసులతోనూ కౌశిక్ రెడ్డి వాగ్వాదం

Related News

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

Big Stories

×