EPAPER

Bandaru Dattatreya: ఓటు వేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ..

Bandaru Dattatreya: ఓటు వేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ..

Bandaru Dattatreya exercised his Vote: పార్లమెంటు నాలుగో దఫా ఎన్నికల్లో భాగంగా నేడు తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.


రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు, బండి సంజయ్, ఈటల రాజేందర్, కేటీఆర్, అసదుద్దీన్, సినీ నటుడు చిరంజీవి, అల్లు అర్జున్ తో సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్, అతని భార్య లక్ష్మి ప్రణతితో ఆయన తల్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని రామ్ నగర్ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమన్నారు. ఓటుతో మార్పు తేవచ్చని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యానికి మరింత బలం చేకూర్చాలన్నారు.


Also Read: తెలంగాణలో పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

కాగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక తోపాటు తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనున్నది.

Related News

Sharannavaratri: శరన్నవరాత్రి వేడుకలు… ఎక్కడెక్కడ భారీగా జరుగుతున్నాయో తెలుసా..?

Bathukamma: అమెరికాలోనూ బతుకమ్మకు అరుదైన గుర్తింపు… అధికారిక ప్రకటనలిచ్చిన మేయర్లు

Harishrao: హరీశ్‌రావు నయా యాక్షన్ ప్లాన్.. దసరా రోజు వారికి ఇబ్బందులు తప్పవా?

Telangana Cabinet: త్వరలోనే కేబినెట్ విస్తరణ.. కొండా సురేఖ ఔటా..?

Appointments: దసరా వేళ సంతోషంలో కాంగ్రెస్ కేడర్.. త్వరలోనే మరిన్ని..

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

×