EPAPER

GHMC : టార్గెట్ జీహెచ్‌ఎంసీ

GHMC : టార్గెట్ జీహెచ్‌ఎంసీ

GHMC : గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై పీసీసీ చీఫ్, నేతలతో క్షుణ్ణంగా చర్చించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్ల వారీగా పార్టీ బలాబలాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై రూట్ మ్యాప్ తయారుచేయాలని, అదే విధంగా నగర స్థాయిలో కాంగ్రెస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని పీసీసీ చీఫ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథం, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, సమీరుల్లా, కార్పొరేషన్ చైర్మన్‌‌లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


క్లీన్ స్వీప్ చేయాలి – ఇప్పటికే నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి క్షేత్రస్థాయి నేతలతో సమీక్ష పూర్తిచేసిన పీసీసీ చీఫ్ బుధవారం హైదరాబాద్ జిల్లా పరిధిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నగర స్థాయిలో పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి సంస్థాగత బాధ్యతలు అప్పగించటం, క్రియాశీలంగా క్షేత్రస్థాయిలో ఉన్నవారికి జీహెచ్ఎంసీ ఎన్నికలలో వారికి అవకాశం ఇవ్వనున్నట్లు పీసీపీ చీఫ్ స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కమిటీ నిర్మాణంలోనూ చురుకైన నేతలకు ప్రాధాన్యత ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో డివిజన్ల వారీగా పార్టీకి వచ్చిన ఓట్లను ఆయన పరిశీలించి, విశ్లేషించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఈ బలం మరింత పెరిగిందని, పథకాలను జనంలోకి తీసుకుపోవటం ద్వారా గెలుపును ఖాయం చేసుకుందామని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఈ లెక్కలు మారుద్దాం – 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లలో మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలవగా, ఆ ముగ్గురిలో ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ పార్టీని వీడినా, కాంగ్రెస్ తన పోరాటాన్ని సాగించింది. అప్పట్లో 56 స్థానాల్లో గెలిచిన బీఆర్​ఎస్, ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠాన్ని దక్కించుకున్నా.. గ్రేటర్‌లో గట్టి పోటీకే పరిమితమై, సీట్లు దక్కించుకోలేకపోయింది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరటంతో క్షేత్రస్థాయిలో బలం పెరిగింది. ఈ క్రమంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు.


ALSO READ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

డివిజన్ల వారీ ఎజెండా – స్థానిక సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు నేతలు చొరవ చూపాలని ఆయన డివిజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎంఐఎం ప్రభావిత ప్రాంతాలలోనూ పోటీ ఉంటుందని, అక్కడా కార్యకర్తలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలన్నారు. చురుకుగా పనిచేసే కార్యకర్తలను గుర్తించి, వారికి స్థానికంగా బాధ్యతలు అప్పగించాలని నేతలకు సూచించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ల వారీ ఎజెండాను రెడీ చేయాలని, అప్పుడే విజయం సాధించటం సాధ్యమవుతుందని క్లారిటీ ఇచ్చారు. గెలుపుపై అతివిశ్వాసంతో ఇంటికే పరిమితమైతే కుదరదని, ఇకపై నేతలంతా జనంలో ఉండాలని అల్టిమేట్టమ్ జారీ చేశారు.

అంతా బాగుంది – బుధవారం నాటి సమావేశానికి ముందు వరంగల్ జిల్లా కాంగ్రెస్ విభేదాలపై టీపీసీసీ చీఫ్ స్పందించారు. కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతోనే అక్కడి నేతల మధ్య అపోహలు ఏర్పడ్డాయని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే కొందరు వరంగల్ నేతలు తనని కలిశారని, సమస్యలు పరిష్కరించుకోవాలని వారికి సూచించామని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలను తాము సరి చేసుకుంటామని, అతి త్వరలో సమస్యలన్నీ తీరిపోతాయని పీసీసీ చీఫ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Related News

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

Ekashila Housing Society: ఏకశిలలో ఏకఛత్రాధిపత్యం, సొసైటీ మాటున అక్రమాలెన్నో.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Mlc Kodandaram : గురుకులాలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది – ఎమ్మెల్సీ కోదండరాం

Special Powers To Hydra: హైడ్రా కోరలకు మరింత పదును.. జీవో జారీ, ఇక వాటిపై కమిషనర్‌దే ఫైనల్ నిర్ణయం

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్ రావ్ ఫైర్

Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?

Hyderabad : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Big Stories

×