EPAPER

Telangana Weather: హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. మళ్లీ క్లౌడ్ బరస్ట్ ?

Telangana Weather: హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. మళ్లీ క్లౌడ్ బరస్ట్ ?

Telangana Weather Update: హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భీకరమైన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో అత్యధికంగా 2 గంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరదనీటిలో బైక్ తో సహా కొట్టుకుపోతున్న వ్యక్తిని అక్కడే ఉన్న ఇద్దరు యువకులు రక్షించారు. ఎల్బీనగర్ స్టేడియం ప్రహరీగోడ కూలిపోయింది. కృష్ణానగర్ ప్రాంతమంతా మినీ చెరువును తలపించింది. నగరంలోని డ్రైనేజీలు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం ఒక్కసారిగా అస్తవ్యస్తమైంది.


భారీవర్షానికి జలమయమైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నాలాలను ఓపెన్ చేసి.. వర్షపునీటిని క్లియర్ చేస్తున్నారు. వరద నీటిలో పార్సిగుట్ట నుంచి రామ్ నగర్ లోని ఆశీర్వాద్ అపార్ట్ మెంట్స్ వద్దకు ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకుని వచ్చింది. ఆ వ్యక్తిని రామ్ నగర్ కు చెందిన అనిల్ గా గుర్తించారు.

కాగా.. హైదరాబాద్ కు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే నగరంలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఐటీ ఉద్యోగులకు దాదాపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారీ వర్షసూచన నేపథ్యంలో మిగతా ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ రంగంలోకి దిగి.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతోందని తెలిపింది.


Also Read: హైదరాబాద్‌లో కుండపోత వర్షం..

అల్వాల్, చింతల్, చైతన్యపురి, ఎర్రమంజిల్, గడ్డి అన్నారం, దిల్ సుఖ్ నగర్, మేడిపల్లి, కృష్ణానగర్, కుషాయిగూడ, మెహదీపట్నం, మేడ్చల్, మేడిపల్లి, మూసారాంబాగ్, ఓల్డ్ సిటీ, పార్సిగుట్ట, ప్రకాశ్ నగర్, కుత్బుల్లాపూర్, రామ్ నగర్, సికింద్రాబాద్, షాద్ నగర్ లలో సుమారు 3 గంటలపాటు ఎడతెరపి లేని వర్షం కురిసింది.

సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకూ ఆవర్తనం విస్తరించి ఉందని, దాని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు జోగులాంబ గద్వాల, జనగాం, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, సిద్ధిపేట, వనపర్తి, జనగాం జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది.

ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రానివ్వొద్దని హెచ్చరించారు. హైదరాబాద్ లో అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. అవసరమైనవారు 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ తెలిపింది.

 

 

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×