EPAPER

Amrapali: తీపి కబురు చెప్పిన ఆమ్రపాలి..

Amrapali: తీపి కబురు చెప్పిన ఆమ్రపాలి..

GHMC Commissioner Amrapali: వినాయక నిమజ్జనానికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చెప్పారు. ప్రణాళిక ప్రకారం నిమజ్జనాలు జరిగేలా పోలీసులు, అధికారులు కృషి చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. శనివారం ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనం ఊరేగింపునకు వచ్చే మార్గాలను డీజీపీ జితేందర్, హైదరాదాద్ సీపీ సీవీ ఆనంద్ తోపాటు పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని భక్తులకు ఆమె సూచించారు. 73 పాండ్లు, 5 పెద్ద చెరువుల వద్ద వినాయకుల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. పాండ్ల వద్ద విద్యుత్, తాగునీరు, శానిటేషన్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీటితోపాటు ఓ తీపి కబురు కూడా చెప్పారు. అదేమంటే.. అవసరమైన చోట ఉచితంగా భోజన కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామంటూ ఆమె పేర్కొన్నారు.


Also Read: మణుగూరులో టెన్షన్.. పౌరహక్కుల నేతల అరెస్ట్

సెప్టెంబర్ 17, 18,19 తేదీల్లో.. మొత్తం మూడురోజులపాటు 15 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. శానిటేషన్ సిబ్బందితోపాటు గజ ఈత గాళ్లను సైతం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, గతంలో నిమజ్జనాల సమయంలో జరిగిన అనుభవాలను పరిగణలోనికి తీసుకుని, అవి మళ్లీ పునరావృతం కాకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. నిమజ్జనాలు చేసే చెరువుల వద్ద భారీ క్రేన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శోభాయాత్రలు నిర్వహించే రహదారులను ఇప్పటికే రిపేర్ చేశామన్నారు. ఆ మార్గాల్లో స్ట్రీట్ లైట్లను సైతం ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో జోనల్ కమిషనర్లతోపాటు పోలీస్ శాఖ, ఇతర సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు.


Also Read: మేమే బెస్ట్.. బీఆర్ఎస్ వేస్ట్.. మంథనిలో ఐటీ కంపెనీ ప్రారంభించిన శ్రీధర్ బాబు

ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 17న మంగళవారం రోజున నగరంలోని అతిపెద్ద వినాయకుడు.. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనున్నది. ఇదేరోజున నగరవ్యాప్తంగా ఉన్న భారీ వినాయకుల నిమజ్జనం కూడా జరగనున్నది. ఈ నేపథ్యంలో నిమజ్జన ప్రదేశాలకు గణనాథులు క్యూ కట్టనున్నాయి. ఇటు నిమజ్జనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఆరోజు భారీగా ఉండనున్నది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. పలువురు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిసారి వస్తుంటారు. ఇటు స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా వచ్చి గణనాథులను వినాయక విగ్రహాలను గంగమ్మ ఒడికి సాగనంపనున్నారు. నిమజ్జనాల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో భక్తులతో కిటకిటలాడుతూ కనువిందు చేయనున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తినా వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటు భక్తులు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాలు చేయాలంటూ ఆమె సూచించారు.

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×