EPAPER

Hyderabad Ladbazar Bangles : హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్..

Hyderabad Ladbazar Bangles : హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్..
GI Tag for hyderabad lakka gajulu
GI Tag for hyderabad lakka gajulu

GI Tag for Hyderabad Ladbazar Bangles : హైదరాబాద్ లో తయారయ్యే ప్రసిద్ధమైన లక్కగాజులకు అరుదైన గౌరవం దక్కింది. వాటికి జీఐ (Geographical Identity) గుర్తింపు లభించింది. చెన్నై జీఐ రిజిస్ట్రీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. దీనితో కలిపి ఇప్పటి వరకూ తెలంగాణకు 17 జీఐ ట్యాగ్ లు వచ్చాయి. హైదరాబాద్ హలీమ్ కు కూడా జీఐ ట్యాగ్ దక్కిన విషయం తెలిసిందే.


ఎంతో ప్రాముఖ్యత ఉన్న హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని నగరానికి చెందిన క్రిసెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2022 జూన్ లో దరఖాస్తు చేసింది. ఇందుకోసం తెలంగాణ ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్ మెంట్ సహాయం అందించింది. దాదాపు 18 నెలల పరిశీలన అనంతరం చెన్నైలో గల జీఐ రిజిస్ట్రీ వీటికి జీఐ ట్యాగ్ ను ఇస్తూ ప్రకటన విడుదల చేసింది.

Read More : తెలంగాణ ప్రజలూ..ఈ 5 రోజులు జాగ్రత్త.. హెచ్చరించిన వాతావరణశాఖ


నగరంలోని పాతబస్తీ, చార్మినార్ ప్రాంతాల్లో లక్క గాజుల్ని తయారు చేసి అమ్ముతుంటారు. సుమారు 6 వేల కుటుంబాలు వీటి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. చార్మినార్ లాడ్ బజార్ లాక్ గాజులు అని కూడా పిలుస్తారు. లక్కతో తయారు చేస్తారు కాబట్టి.. తెలుగులో లక్కగాజులని పిలుస్తారు. ఇవి స్థానికంగానే కాదు.. ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ ప్రసిద్ధి చెందాయి. లక్కగాజుల తయారీ చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎంతో నైపుణ్యంతో తయారు చేయాల్సి ఉంటుంది.

నిప్పుల కొలిమిపై రెసిన్ ను కరిగించి లక్కను తీస్తారు. దానిని గుండ్రంగా మలిచి.. దానిపై రాళ్లు, అద్దాలు, పూసలు, స్ఫటికాలను అద్దుతారు. మొగలుల కాలం నుంచి వీటి తయారీ ప్రారంభమైంది. కాలక్రమేణా లక్కగాజుల తయారీలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు లక్క గాజులకు జీఐ ట్యాగ్ ఇవ్వడంతో.. వీటికిి మరింత ప్రత్యేక గౌరవం దక్కుతుంది. లక్క గాజుల మార్కెటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. లక్కగాజుల తయారీపై ఆధారపడిన కుటుంబాలకు ఇదొక ప్రోత్సాహకంగా ఉంటుంది.

Read More : రోగులను గాలికొదిలేసి బర్త్ డే వేడుకలు.. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే డీజే..

హైదరాబాద్ హలీం, వరంగల్ డర్రీస్, నిర్మల్ కొయ్య బొమ్మలు – చిత్రాలు, నిర్మల్ ఫర్నీచర్, నిర్మల్ పెయింటింగ్స్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, పోచంపల్లి ఇక్కత్ చీరలు, చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్, గద్వాల చీరలు, సిద్ధిపేట గొల్లభామ చీరలు, నారాయణ్ పేట్ చేనేత చీరలు, పుట్టపాక తెలియా రుమాల్, ఆదిలాబాద్ డోక్రా, తాండూరు కందిపప్పు తదితర తెలంగాణ ఉత్పత్తులు జీఐ ట్యాగ్స్ పొందాయి. తాజాగా లక్కగాజులకు జీఐ ట్యాగ్ రావడంపై నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Big Stories

×