EPAPER

Radisson Drugs Case: మత్తు వదలరా..!

Radisson Drugs Case:  మత్తు వదలరా..!

 


drugs


గత 10 సంవత్సరాలుగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం అంటూ పట్టుబడినప్పుడే మీడియా, పోలీసులు హాడావుడి చేస్తున్నారు. సరైన సాక్ష్యాధారాలు సేకరించకపోవడంతో నిందితులకు శిక్ష పడటం లేదు. గంజాయి కేసుల్లో తప్ప.. మరే డ్రగ్స్ కేసుల్లో రెండంకెల శాతం కన్వెక్షన్ రేట్ పడటం లేదు. సాధారణ క్రైంలో 41 శాతం శిక్షలు పడుతుంటే డ్రగ్స్ కేసులో నిందితులు అంతా బాధితులుగా మారిపోయి తప్పించుకుంటున్నారు. ఆ తర్వాత పోలీసులు కాల్ డేటా పేరుతో వీవీఐపీలను వేధింపులకు గురి చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని బంజారాహిల్స్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వరకు ఉన్న ప్రముఖులు ఎవ్వరికీ చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు.

Read more: ఎత్తిపోతలు.. ఉత్త మాటలు..!

కిలాడీ కేదార్.. ట్విస్టులెన్నో..!

డ్రగ్స్ సప్లై అంతా ఈవెంట్ మేనేజర్స్, హోటల్ నిర్వాహకుల కనుసన్నల్లోనేనని గతంలో పోలీసులు తేల్చేశారు. సినీ పెద్దల విచారణలో సిట్ కూడా ఇదే చెప్పింది. కానీ, ఎక్కడా పట్టుబడకుండా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారు. గచ్చిబౌలీ రాడిసన్ బ్లూ పబ్ లో పట్టుబడిన 5వ నిందితుడు, సినీ నిర్మాత కేదార్ సెలగంశెట్టి చరిత్ర అంతా వివాదాల చుట్టే ఉంది. హోటల్స్ బిజినెస్‌తో పాటు ప్రత్యేక ఏవియేషన్ నడిపించే స్థాయికి ఎదగడం వెనుక రాజకీయ నాయకుల పెట్టుబడులు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. న్యూజెర్సీలో మిర్చీ రెస్టారెంట్ పెట్టిన కేదార్ పనిచేసేందుకు అక్రమంగా మనుషులను రవాణా చేశాడు. దీంతో పట్టుబడే అవకాశాలు ఉన్నాయని తెలుసుకుని హైదరాబాద్‌కు మకాం మార్చాడు.

ఇక్కడ బఫెలో వైల్డ్ వింగ్స్ పేరుతో 7 బ్రాంచులను ఓపెన్ చేశాడు. ఇందులో కీలక నేతల పెట్టుబడులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత హైలైప్ పబ్స్‌తో పాటు జూబ్లీ 800 పబ్స్‌ని నడిపించాడు. సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ కొంతమంది హీరో కుటుంబాలతో బిజినెస్ సంబంధాలు పెట్టుకున్నాడు. నష్టాలు వచ్చినా.. ప్రత్యేక విమానాల్లో తిరగడం, తిప్పడం ఈయనకు ఇష్టం. ఆ విమానాల నుంచి ఏదైనా సరుకు సప్లై అయిందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సినీ ప్రముఖులను చూపి.. రాజకీయ నాయకులకు దగ్గర అయ్యేవాడని తెలుస్తోంది. నేతల పుత్ర రత్నాలను తన బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టించే వాడని అంటున్నారు. న్యూజెర్సీ నుంచి డ్రగ్స్ కేసులో నిందితుడి వరకు కేదార్ ఎన్నో వ్యవహారాలు నడిపించాడని తెలుస్తోంది.

డ్రగ్స్‌కి ఇప్పటికైనా చెక్ పెడతారా?

ఎంతమందిని అరెస్ట్ చేసినా వెంటనే బయటకు వచ్చేస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం డ్రగ్స్ తీసుకున్న వారంతా బాధితులే. అయితే.. వారిని రీహాబిటేషన్​ సెంటర్స్‌కి పంపివ్వాలి. కానీ, ప్రభుత్వ సౌకర్యాలు లేకపోవడంతో ఆయా నిందితులు కోర్టులో బెయిల్ ఇస్తే.. సొంతంగానే చికిత్స తీసుకుంటామని చెప్పి ఇంట్లోనే డాక్టర్స్‌తో కౌన్సెలింగ్ ఇప్పించుకుంటున్నారు. అయితే.. ఇదే అదునుగా పోలీసులు కూడా కేసులో కాల్ డేటా అంటూ మరికొంత మందిని వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పని చేసిన సైబరాబాద్ సీపీతో పాటు పలువురి అధికారుల పాత్ర కూడా ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇలా జరగడంతోనే డ్రగ్స్‌కి చెక్ పెట్టలేకపోతున్నారు. ఆఫీసర్స్ నిత్యం నిఘా ఉంచి డ్రగ్స్‌ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×