EPAPER

Flood water into bus : ఆర్టీసీ బస్సులోకి వరద నీరు.. స్మార్ట్ సిటీలోనే ఇంత దారుణమా?

Flood water into bus : ఆర్టీసీ బస్సులోకి వరద నీరు.. స్మార్ట్ సిటీలోనే ఇంత దారుణమా?

Flood water into RTC bus : హైదరాబాద్ లో శుక్రవారం నాడు కురిసిన వర్షాలకు నగరంలోకి పలు చోట్ల రోడ్లపై వరద నీరు పారింది. చుక్క వర్షం కురిస్తేనే నదుల్ని తలపిస్తున్న భాగ్యనగర రోడ్ల పరిస్థితి.. ఈ వర్షాలతో మరోసారి బయటపడింది. కాసేపు కురిసిన వానకే.. రోడ్లపై మోకాలి లోతుకు నీరు చేరగా.. నడిచివెళ్లే వాళ్లు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం నాడు కురిసిన వర్షానికి కొండాపూర్ లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులోని వరద నీరు భారీగా చేరింది. దీన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది.


ఆర్టీసీ బస్సులోకి భారీగా వరద నీరు రావడంతో అందులోని ప్రయాణికులు ఇబ్బంది పడగా.. ఆటోలు, బైక్ లపై వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. చిన్న కార్లల్లో ప్రయాణించిన వారు సైతం సైలెన్సర్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. ఇక నడిచి వెళ్లే వాళ్లు వారి ప్రయాణాల్ని ఆ రోడ్లల్లో ఆపేసుకోవాల్సి వచ్చింది. నీళ్లు వెళ్లేందుకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో.. ఎక్కడి నీరు అక్కడే నిలబడి వరదలు పారాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా ఎంత అభివృద్ధి చెందిన ఇక్కడ డ్రైనేజీ మారందంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు.. కొత్త ప్రభుత్వంలోనైనా సరైన చర్యలు తీసుకోవాలంటూ అభ్యర్థించారు.


 

Related News

Janwada Case : డ్రగ్స్ కేసు.. అనుమానితులపై ప్రశ్నల వర్షం.. తీగ లాగితే డొంక కదిలేనా.?

Hospital Land Occupied : కబ్జారాయుళ్ల ఓవరాక్షన్.. ఆసుపత్రి స్థలానికే ఎసరు.. రంగంలోకి హైడ్రా.?

Chit Fund Company Fraud : మా డబ్బులు ఏవి.?.. చిట్ ఫండ్స్ మాయాజాలం.. బాధితులు కన్నీళ్ల పర్యంతం

HYDERABAD RAINS: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వాన‌..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్.!

Momos Issue: కల్తీ మోమోస్ తయారు చేసిన.. బీహార్‌ గ్యాంగ్‌ అరెస్ఠ్..!

KTR Padayatra: కేటీఆర్ పాదయాత్ర.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

Big Stories

×