EPAPER

Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. జేసీబీతో గోడలు బద్ధలుకొట్టి

Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. జేసీబీతో గోడలు బద్ధలుకొట్టి

Old City: పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పురానాపూల్ సమీపంలోని కామాటిపురలో టెంట్ హౌజ్ డెకరేషన్ చేసే సామాగ్రి కార్ఖానాలో ఈ ప్రమాదం జరిగింది. రెండు సిలిండర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకుంది.


రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కలా గోదాములు ఉన్నట్టు తెలిసింది. మంటలు ఉధృతమవగానే స్థానిక దుకాణదారులు, ప్రజల భయంతో పరుగుపెట్టారు. సమీపంలోని ఇతర గోదాములకూ మంటలు వ్యాపించే ముప్పును గ్రహిస్తూ ఆందోళనచెందారు. అయితే, సకాలంలో ఫైర్ సిబ్బంది స్పాట్‌కు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. డెకరేషన్ సామాగ్రి కావడంతో మంటలు అంతకంతకూ పెరిగాయి. ఇంకా మంటలు ఇంకా అదుపు లోకి రాలేవు.

దట్టమైన పొగ ఈ సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికారులు ఏకంగా జేసీబీని ఉపయోగించాల్సి వచ్చింది. మంటలు అంటుకున్న భవనం గోడలను జేసీబీతో బద్ధలు కొట్టించి ఫైర్ సిబ్బంది లోనికి వెళ్లింది. ఆ మంటల్లో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.


Also Read: Independence Day: అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించేది సీఎం కాదు.. మంత్రే!

పాతబస్తీలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు నిత్యం అలర్ట్‌గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం జరగలేదు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×