EPAPER

Karimnagar Filigree : అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్.. గెస్టులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు

Karimnagar Filigree : అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వెడ్డింగ్.. గెస్టులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు

Karimnagar Filigree : కరీంనగర్ ఫిలిగ్రీ కళాఖండాలు మరోసారి ఖండాంతరాలను దాటనున్నాయి. అంబానీ ఇంట్లో జూలైలో జరగబోయే పెండ్లికి వచ్చే గెస్టులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలను రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు. గత మార్చిలో దిగ్గజ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. కాగా జులైలో వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకల్లో అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ బహుమతులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు భౌగోళిక గుర్తింపు పొందిన ఫిలిగ్రీ తయారీదారులకు ఆర్డర్లు ఇవ్వడంతో కరీంనగర్ కళకు అరుదైన గుర్తింపు లభించినట్లైంది.


ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు సమీపిస్తున్నాయి. పెండ్లికి వచ్చే గెస్టులకు వెండితో చేసిన జ్యువెల్లరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ ఇతర బహుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటికే 400 ఫిలిగ్రీ కళాఖండాల కోసం అంబానీ ఫ్యామిలీ నుంచి ఆర్డర్ వచ్చినట్టు కరీంనగర్ సిఫ్కా అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ఈ కళాఖండాల ద్వారా అంబానీ ఇంట పెండ్లికి వచ్చే ప్రముఖులకు 400 ఏళ్ల నాటి ఫిలిగ్రీ ప్రాచీన కళ పరిచయమవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సంపన్నుల ఇండ్లకు తమ కళాఖండాలు చేరుతాయని ఆనందం వ్యక్తం చేశారు.

Also Read : ఖరీదైన కారు కొన్న నీతా అంబానీ.. ధర చూస్తే షాక్!


గతేడాది జరిగిన జీ-20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి కళాకారులే తయారు చేసి పంపించారు. అంతేకాకుండా ఇతర కార్యక్రమాలకు నుంచి ఆభరణాల పెట్టెలు, పర్సులు, ట్రేలు, పండ్ల గిన్నెలు, ఇతరత్రా కళాఖండాల కోసం ఆర్డర్లు లభించాయి. తాజాగా అపరకుబేరుడి ఇంట పెళ్లి కోసం అద్భుతమైన బహుమతుల జాబితాలో ఫిలిగ్రీ చేర్చడం అదనంగా ఉందని కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2023 నవంబర్ లో హైదరాబాద్‌ అరంగేట్రం చేసిన రిలయన్స్ రిటైల్ స్వదేశ్ స్టోర్‌కు సిఫ్కా వస్తువులను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న సిఫ్కా సొసైటీ, ముంబైలోని ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ ప్రదర్శించిన ఫిలిగ్రీ కళాఖండాలు అంబానీని ఆకట్టుకున్నాయి.

సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాలను చేయడంలో కరీంనగర్ కళాకారులు సిద్ధహస్తులు. తరతరాలుగా వస్తున్న ఈ పురాతన హస్తకళతో కరీంనగర్‌లోని దాదాపు 150 కుటుంబాలకు చెందిన 300 మంది జీవనోపాధి పొందుతున్నారు. 400 ఏళ్లుగా వస్తున్న ఈ పురాతన కళను ఇంకా కొనసాగిస్తున్నారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×