BigTV English

Congress: కొట్టుకున్న కాంగ్రెస్.. కొండా వర్సెస్ ఎర్రబెల్లి.. రచ్చ రచ్చ..

Congress: కొట్టుకున్న కాంగ్రెస్.. కొండా వర్సెస్ ఎర్రబెల్లి.. రచ్చ రచ్చ..
congress fight

Latest congress news in telangana(telugu breaking news today): అట్లుంటది కాంగ్రెస్‌తోని. అంతా ఆ పార్టీ నాయకులే. వారిలో వారికి పడదు. చిన్న కారణం దొరికితే చాలు. డిష్యూం డిష్యూం.


వరంగల్‌లో కాంగ్రెస్ సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. పార్టీలోని రెండు గ్రూపులు ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. కెమెరాల సాక్షిగా.. చితక్కొట్టుకున్నారు. దాడిలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి చొక్కాలు చినిగిపోయాయి. అసలేం జరిగిందంటే…

వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీనియర్ లీడర్ ఎర్రబెల్లి స్వర్ణను నియమించింది పార్టీ. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎర్రబెల్లి స్వర్ణ, దొంతి మాధవరెడ్డి, జంగా రాఘవరెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి కొండా సురేఖ, కొండా మురళీలను పిలవలేదంటూ.. కొండా వర్గీయులు ఆందోళనకు దిగారు.


అల్లరి చేస్తే క్షమించేది లేదని.. అంతు చూస్తానంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మరింత రెచ్చిపోయిన కొండా మనుషులు.. ఎర్రబెల్లి అనుచరులపై దాడికి దిగారు. వేదికపై కిందకు లాగి మరీ కొట్టారు. చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది.

తాజా, ఘటనతో కాంగ్రెస్ పార్టీ అసలేమాత్రం మారలేదనే విమర్శ వినిపిస్తోంది. ఐకమత్యంగా ప్రయత్నిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. ఎన్నికల ముందు ఇలా గ్రూపులుగా చీలి.. కొట్టుకున్నారంటే.. ఇక వాళ్లు కలిసి పని చేస్తారా? పార్టీని గెలిపిస్తారా? వాళ్లలో వాళ్లు తగువులాడుకొని.. వేరే పార్టీకి లాభం చేకూర్చరా? ఇలాంటి అంతర్గత కుమ్ములాటలపై పార్టీ అధిష్టానం సీరియస్‌ యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటున్నారు కార్యకర్తలు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×