EPAPER

Farmhouse case: ఫాంహౌజ్ కేసులో సిట్ దూకుడు.. పరారీలో కేరళ వైద్యుడు..

Farmhouse case: ఫాంహౌజ్ కేసులో సిట్ దూకుడు.. పరారీలో కేరళ వైద్యుడు..

Farmhouse case: ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలిగినట్టు.. ఫాంహౌజ్ కేసులో లింకు లాగుతుంటే.. ఎక్కడెక్కడో డొంకలు కదులుతున్నాయి. హైదరాబాద్ తో సహా మరో మూడు రాష్ట్రాల్లో సిట్ సోదాలు జరిగాయి. మొత్తం 7 బృందాలతో హర్యానా, ఏపీ, కర్ణాటకలో సిట్ తనిఖీలు నిర్వహించింది. లేటెస్ట్ గా.. కేరళలోనూ ఎంట్రీ ఇచ్చింది సిట్.


ఫాంహౌజ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రామచంద్రభారతికి కేరళలోని ఓ ఆయుర్వేద వైద్యుడు అత్యంత సన్నిహితుడిగా గుర్తించారు సిట్ అధికారులు. అతని దగ్గర మరిన్ని ఆధారాలు ఉండొచ్చనే అనుమానంతో.. కేరళ వెళ్లారు. అయితే, ఆ కేరళ వైద్యుడి ఆశ్రమం గురించి సిట్ బృందం స్థానికులను ప్రశ్నిస్తుండగా.. పోలీసులు వచ్చిన విషయం ఆ డాక్టర్ కు తెలిసింది. దీంతో, వెంటనే ఆ వైద్యుడు ఆశ్రమం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు వెళ్లే సరికి ఆయన అక్కడ లేరు.

కేరళ పోలీసుల సహాయంతో ఆ ఆశ్రమం ఇంచార్జిని అదుపులోకి తీసుకుంది సిట్. పరారీలో ఉన్న వైద్యుడి గురించి గాలిస్తున్నారు. ఆ డాక్టర్ ను పట్టుకుని విచారిస్తే.. రామచంద్రభారతికి చెందిన మరింత సమగ్ర సమాచారం తెలుస్తుందని అంటున్నారు సిట్ అధికారులు. ఇలా మొయినాబాద్ ఫాంహౌజ్ కేసులో సిట్ అధికారులు పలు రాష్ట్రాల్లో దూకుడు పెంచుతున్నారు.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×